ఉపోద్ఘాతం
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు మూలమైనది వేదం. వేదాన్ని ఆస్తిక జనులందరు పరమ ప్రమాణంగా సంభావించి సమాదరిస్తారు. జ్ఞానవిజ్ఞానరాశి అయిన వేదం అధ్యయనపరంగా, అర్థవగాహనపరంగా సామాన్యులకు సులభంగా అందనిది.
వైదోక్తమైన ధర్మాదులను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అందించి తద్వారా వారుకూడా తరించేవిధంగా విలసిల్లిన విషయరాశే పురాణాలు.
వేదం ప్రభువుల శాసిస్తుందే తప్ప, అది విశదపరిచే విషయాచరణ వలన కలిగే ఫలితం గురించి వివరించదు. పురాణాలు అలాకాక ఓ మిత్రునిలా హితం చేకూరుస్తాయి. అంటే వేదోక్తమైన వాక్యాలను ఆఖ్యానరూపంలో, సులభ గ్రాహ్యమైన రీతిలో అందిస్తాయి.
దీనినిబట్టి వేదసారం పురాణాలలో నిక్షిప్తమై ఉన్నదని తెలుస్తుంది. అందుకే "వేదాః ప్రతిష్ఠితాః సర్వే పురాణే నాత్ర సంశయః" అని నారద పురాణం (2.24.17) అంటున్నది.
అపారమైన సంస్కృత వాఙ్మయంలో పురాణాలది చాలా విలక్షణమైన స్థానం. పురాణాలవల్లే ప్రాచీన భారతీయ దార్శనిక, ధార్మిక, భౌగోళిక, రాజనీతిక, బతిహాసిక, సామాజిక, సాంస్కృతిక, ప్రవృత్త్యనుష్ఠానాది సంవిధానాదులు బోధపడుతున్నాయి. అలాంటి పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు లోకకల్యాణం కొరకై పురాణ రచనను చేసి తన తనయుడైన శుకమహర్షితో పాటుగా ముఖ్య శిష్యుడైన సూత మహర్షికి (రోమహర్షణకు) ఉపదేశించారు. సూతుడు, సుమత్రి, అగ్నివర్ణుడు, మిత్రాయువు, శాంసపాయణుడు, అకృత ప్రణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు అలాగే సౌతి (రోమహర్షుణి కుమారుడు రామహర్షణి) కి ఉపదేశించగా, వారు పురాణాలను ప్రచారం చేశారు. అలా వ్యాప్తి చెందిన పురాణాలు, మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలుగా కీర్తించబడుతున్నాయి.
మహాపురాణాలు పదునెనిమిది అని ప్రసిద్ధి. భాగవతానుసారం వాటి క్రమం ఈ విధంగా ఉన్నది. బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, లింగ, గరుడ, నారద, భాగవత,.............................
ఉపోద్ఘాతం భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు మూలమైనది వేదం. వేదాన్ని ఆస్తిక జనులందరు పరమ ప్రమాణంగా సంభావించి సమాదరిస్తారు. జ్ఞానవిజ్ఞానరాశి అయిన వేదం అధ్యయనపరంగా, అర్థవగాహనపరంగా సామాన్యులకు సులభంగా అందనిది. వైదోక్తమైన ధర్మాదులను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అందించి తద్వారా వారుకూడా తరించేవిధంగా విలసిల్లిన విషయరాశే పురాణాలు. వేదం ప్రభువుల శాసిస్తుందే తప్ప, అది విశదపరిచే విషయాచరణ వలన కలిగే ఫలితం గురించి వివరించదు. పురాణాలు అలాకాక ఓ మిత్రునిలా హితం చేకూరుస్తాయి. అంటే వేదోక్తమైన వాక్యాలను ఆఖ్యానరూపంలో, సులభ గ్రాహ్యమైన రీతిలో అందిస్తాయి. దీనినిబట్టి వేదసారం పురాణాలలో నిక్షిప్తమై ఉన్నదని తెలుస్తుంది. అందుకే "వేదాః ప్రతిష్ఠితాః సర్వే పురాణే నాత్ర సంశయః" అని నారద పురాణం (2.24.17) అంటున్నది. అపారమైన సంస్కృత వాఙ్మయంలో పురాణాలది చాలా విలక్షణమైన స్థానం. పురాణాలవల్లే ప్రాచీన భారతీయ దార్శనిక, ధార్మిక, భౌగోళిక, రాజనీతిక, బతిహాసిక, సామాజిక, సాంస్కృతిక, ప్రవృత్త్యనుష్ఠానాది సంవిధానాదులు బోధపడుతున్నాయి. అలాంటి పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు లోకకల్యాణం కొరకై పురాణ రచనను చేసి తన తనయుడైన శుకమహర్షితో పాటుగా ముఖ్య శిష్యుడైన సూత మహర్షికి (రోమహర్షణకు) ఉపదేశించారు. సూతుడు, సుమత్రి, అగ్నివర్ణుడు, మిత్రాయువు, శాంసపాయణుడు, అకృత ప్రణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు అలాగే సౌతి (రోమహర్షుణి కుమారుడు రామహర్షణి) కి ఉపదేశించగా, వారు పురాణాలను ప్రచారం చేశారు. అలా వ్యాప్తి చెందిన పురాణాలు, మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలుగా కీర్తించబడుతున్నాయి. మహాపురాణాలు పదునెనిమిది అని ప్రసిద్ధి. భాగవతానుసారం వాటి క్రమం ఈ విధంగా ఉన్నది. బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, లింగ, గరుడ, నారద, భాగవత,.............................© 2017,www.logili.com All Rights Reserved.