గం గణపతయే నమః
అష్టాదశ పురాణాలు
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ II
శ్లో॥ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః ॥
పురాణాలు ఐహికాముష్మిక ఫలదాయకాలు, భారతీయ ఆర్షవిజ్ఞాన సర్వస్వాలు, వేద వేదాంతాంతర్గత తత్త్వ ప్రబోధకాలు. పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడిగా అవతరించి, సకల మానవాళి శ్రేయస్సు కోసం పురాణ సంహితల్ని రచించాడు. పవిత్ర హిమాలయాలలో బదరికాశ్రమంలో, సరస్వతీ నదీతీరంలో ఈ పురాణాల పుణ్యరాశి ఆవిర్భవించి, గోమతీ నదీతీరంలో పరమ పవిత్రమైన నైమిశారణ్య దివ్యక్షేత్రంలో సూతమహర్షి చేత ప్రవచనం చేయబడింది.
సంస్కృతభాషలో వెలువడిన అన్నిరకాల సాహిత్య ప్రక్రియల కన్నా ప్రజలకి అత్యంత సన్నిహితమైన ప్రక్రియ పురాణాలు. మన భారతీయ సంస్కృతికి మూలం వేదధర్మం. ఈ ధర్మాన్ని లోకంలో సుప్రతిష్ఠితం చేయటానికి ఏర్పడినవే పురాణాలు. అందుకే "వేదాః ప్రతిష్ఠితాః సర్వే పురాణే నాత్ర సంశయః" అని స్కాంద పురాణం, “వేదాః ప్రతిష్ఠితా స్సర్వే పురాణేష్వేవ సర్వదా" అని నారద మహాపురాణం చెబుతాయి...........
గం గణపతయే నమః అష్టాదశ పురాణాలు వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం | పరశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ II శ్లో॥ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః ॥ పురాణాలు ఐహికాముష్మిక ఫలదాయకాలు, భారతీయ ఆర్షవిజ్ఞాన సర్వస్వాలు, వేద వేదాంతాంతర్గత తత్త్వ ప్రబోధకాలు. పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడిగా అవతరించి, సకల మానవాళి శ్రేయస్సు కోసం పురాణ సంహితల్ని రచించాడు. పవిత్ర హిమాలయాలలో బదరికాశ్రమంలో, సరస్వతీ నదీతీరంలో ఈ పురాణాల పుణ్యరాశి ఆవిర్భవించి, గోమతీ నదీతీరంలో పరమ పవిత్రమైన నైమిశారణ్య దివ్యక్షేత్రంలో సూతమహర్షి చేత ప్రవచనం చేయబడింది. సంస్కృతభాషలో వెలువడిన అన్నిరకాల సాహిత్య ప్రక్రియల కన్నా ప్రజలకి అత్యంత సన్నిహితమైన ప్రక్రియ పురాణాలు. మన భారతీయ సంస్కృతికి మూలం వేదధర్మం. ఈ ధర్మాన్ని లోకంలో సుప్రతిష్ఠితం చేయటానికి ఏర్పడినవే పురాణాలు. అందుకే "వేదాః ప్రతిష్ఠితాః సర్వే పురాణే నాత్ర సంశయః" అని స్కాంద పురాణం, “వేదాః ప్రతిష్ఠితా స్సర్వే పురాణేష్వేవ సర్వదా" అని నారద మహాపురాణం చెబుతాయి...........© 2017,www.logili.com All Rights Reserved.