అమ్మ అంతగా తనకిష్టమైన ఆవు చనిపోయినప్పుడు ఏడవడం చూచాను. నాన్న ఆవును ఉరేగింపుగా మా నిమ్మతోటకు తీసుకెళ్ళి అందులో ఖననం చేశాడు. ఆ ఆవుతో మేమూ ఆడేవాళ్ళం. కొమ్ము విసిరేది కాదు. అమ్మతో పాటు మాకు ఆప్యాయత పంచిందా సాధుజంతువు.
ఇన్నయ్య హేతువాద ఉద్యమంలో పనిచేయడం వలన సాంబశివరావుగారికీ, ఆవుల గోపాలకృష్ణమూర్తిగారికీ బాగా పరిచయమున్న వ్యక్తి. ఇద్దరం ఇష్టపడ్డాము. పెండ్లి నిశ్చయమైంది. నాన్న ఎంత కట్నమివ్వగలడో చెప్పాడట. అందుకు ఇన్నయ్య 'కట్నం ఆశించడం లేదు. ఇద్దరం చదువుకున్నాం. స్వశక్తితో బ్రతకగలమనే వివాహానికి ఒప్పుకున్నా' నన్నాడట. మా పెళ్ళిలో కట్న కానుకల ప్రసక్తి లేదు.
రాజు యంగ్ గ్లోబల్ లీడరుగా 2007 నుండి 2009 వరకూ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఆహ్వానింపబడ్డారు. 2008 చైనా ఒలింపిక్స్ కి స్టేట్ గెస్ట్ - టార్చ్ బేరర్ గా అటెండయ్యాడు. వరల్డ్ ఎడిటర్స్ ఫోరం ఎక్జిక్యుటివ్ మెంబరు అయ్యాడు. సౌత్ ఏషియన్ జర్నలిజం అసోసియేషన్ లైఫ్ మెంబర్. ఇండియా ఎబ్రాడ్ పేపర్ రాజును "జార్ ఆఫ్ ది డిజిటల్ మీడియా" గా కొనియాడారు. లోగడ ఆ పేపరు వారు రాజును "మ్యాన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపిక చేసి సన్మానించి అవార్డు ఇచ్చారు.
అమ్మా, నాన్నా అల్లారుముద్దుగా పెంచారు నన్ను.అన్నయ్య, ముగ్గురు అక్కలు మమతానురాగాలు పంచారు. కొందరు బంధువులు బాగా దగ్గరయ్యారు. ఎంతోమంది స్నేహితులను పొందగలిగాను. మంచి వ్యక్తులతో పరిచయాలయ్యాయి. నా జీవితానికి పరిపూర్ణతనిచ్చారు నా భర్త నరిసెట్టి ఇన్నయ్య, నా బిడ్డలు నవీన, రాజు. నా ఈ సుదీర్ఘ జీవితం ఎన్నో అనుభవాలకూ, జ్ఞాపకాలకూ అలవాలమయింది. నా జ్ఞాపకాలను అక్షరబద్దం చేయమని ఇన్నయ్య ప్రోత్సహించారు. జి.వి.కె మామయ్య (గోగినేని వెంకట కృష్ణారావు) పదే పదే చెబుతూ పోయారు రాయమని. నా ఈ జ్ఞాపకాలు కాలక్రమానుసారంగా రాయలేదు. సాధ్యమైనంత వరకు జ్ఞాపకాలను గుదిగుచ్చాలనేదే నా ఉద్దేశ్యం.
- వెనిగళ్ళ కోమల
అమ్మ అంతగా తనకిష్టమైన ఆవు చనిపోయినప్పుడు ఏడవడం చూచాను. నాన్న ఆవును ఉరేగింపుగా మా నిమ్మతోటకు తీసుకెళ్ళి అందులో ఖననం చేశాడు. ఆ ఆవుతో మేమూ ఆడేవాళ్ళం. కొమ్ము విసిరేది కాదు. అమ్మతో పాటు మాకు ఆప్యాయత పంచిందా సాధుజంతువు. ఇన్నయ్య హేతువాద ఉద్యమంలో పనిచేయడం వలన సాంబశివరావుగారికీ, ఆవుల గోపాలకృష్ణమూర్తిగారికీ బాగా పరిచయమున్న వ్యక్తి. ఇద్దరం ఇష్టపడ్డాము. పెండ్లి నిశ్చయమైంది. నాన్న ఎంత కట్నమివ్వగలడో చెప్పాడట. అందుకు ఇన్నయ్య 'కట్నం ఆశించడం లేదు. ఇద్దరం చదువుకున్నాం. స్వశక్తితో బ్రతకగలమనే వివాహానికి ఒప్పుకున్నా' నన్నాడట. మా పెళ్ళిలో కట్న కానుకల ప్రసక్తి లేదు. రాజు యంగ్ గ్లోబల్ లీడరుగా 2007 నుండి 2009 వరకూ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఆహ్వానింపబడ్డారు. 2008 చైనా ఒలింపిక్స్ కి స్టేట్ గెస్ట్ - టార్చ్ బేరర్ గా అటెండయ్యాడు. వరల్డ్ ఎడిటర్స్ ఫోరం ఎక్జిక్యుటివ్ మెంబరు అయ్యాడు. సౌత్ ఏషియన్ జర్నలిజం అసోసియేషన్ లైఫ్ మెంబర్. ఇండియా ఎబ్రాడ్ పేపర్ రాజును "జార్ ఆఫ్ ది డిజిటల్ మీడియా" గా కొనియాడారు. లోగడ ఆ పేపరు వారు రాజును "మ్యాన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపిక చేసి సన్మానించి అవార్డు ఇచ్చారు. అమ్మా, నాన్నా అల్లారుముద్దుగా పెంచారు నన్ను.అన్నయ్య, ముగ్గురు అక్కలు మమతానురాగాలు పంచారు. కొందరు బంధువులు బాగా దగ్గరయ్యారు. ఎంతోమంది స్నేహితులను పొందగలిగాను. మంచి వ్యక్తులతో పరిచయాలయ్యాయి. నా జీవితానికి పరిపూర్ణతనిచ్చారు నా భర్త నరిసెట్టి ఇన్నయ్య, నా బిడ్డలు నవీన, రాజు. నా ఈ సుదీర్ఘ జీవితం ఎన్నో అనుభవాలకూ, జ్ఞాపకాలకూ అలవాలమయింది. నా జ్ఞాపకాలను అక్షరబద్దం చేయమని ఇన్నయ్య ప్రోత్సహించారు. జి.వి.కె మామయ్య (గోగినేని వెంకట కృష్ణారావు) పదే పదే చెబుతూ పోయారు రాయమని. నా ఈ జ్ఞాపకాలు కాలక్రమానుసారంగా రాయలేదు. సాధ్యమైనంత వరకు జ్ఞాపకాలను గుదిగుచ్చాలనేదే నా ఉద్దేశ్యం. - వెనిగళ్ళ కోమల
© 2017,www.logili.com All Rights Reserved.