ఆన్లైన్ క్లాసులు
“చందూ” అంటూ మావారు మూడోసారి కేక వేయడంతో వంటింట్లో పని వదిలేసి పిలుపు వచ్చిన దిక్కుగా కదిలాను.
హాల్లో మా 'బుడ్డాడు' బాసంపట్టు ఏసుకొని లాప్టాప్ ముందు కూర్చొని నెట్ కనెక్షన్ సరిగా ఉందో లేదో అని, నెట్ బాక్స్ వైపు, లాప్టాప్ వైపు ఆరాటంగా మార్చి మార్చి చూస్తున్నాడు.
సీన్ కొంత అర్థమైంది. ఇవ్వాల్టి నుండి వాడికి ఆన్లైన్ క్లాసులు. వాడికి ఆన్లైన్ క్లాసులని తెలిసినప్పటి నుండి తెగ సంతోషపడుతూ తిన్మార్ డాన్స్లతో ఇల్లంతా సందడి చేస్తూ, నాన్న తనకు లాప్టాప్ ఇచ్చాడని చెల్లెల్ని ఊరించి ఊరించి ఉడికిస్తున్నాడు. బహుశా ఇప్పడు తన క్లాసులు డిస్టర్బ్ చెస్తుందని చెల్లెల్ని దగ్గరకు రానిచ్చి ఉండడు.
పిలిచిన శాల్తీ ఎక్కడ ఉన్నాడని చూశాను. బాల్కానిలో వాష్ బేసిన్ వాలుకు తగిలించిన అద్దంలో ముఖం చూసుకుంటూ 'విజయ్' షేవింగ్ చేసుకుంటూ కనబడ్డాడు. అతన్ని కుదురుగా షేవింగ్ చేసుకోనీయకుండా 'చిట్టి' వాళ్ల నాన్న వేసుకున్న పొట్టి లాగు గుంజుతూ తనకూ లాప్టాప్ కావాలని ఏడుస్తోంది. నేను ఏడుస్తున్న చిట్టిని ఎత్తుకొని మావారి వైపు కోపంగా చూస్తూ.. దొరికిన అవకాశాన్ని విడవకుండా నేనందుకే ఇద్దరి పిల్లల్ని కనవద్దూ.. అంటే విన్నావు కాదూ. ఇప్పుడు చూడూ! దీనికి లాప్టాప్ ఎక్కడి నుంచి తెచ్చిస్తావు కాస్త విసురుగా అన్నాను.
'చిట్టి' ఏడ్చి ఏడ్చి దాని ముఖం మీద కన్నీళ్లు కాలువలా ప్రవహిస్తూ.. ముక్కు నుండి కారుతున్న జీవనదిలో కలిసిపోయి కలగాపులగంగా దారలు కట్టాయి. ఆ నల్లని మరకల, చారలతో దాని వర్చస్సు మురికిగా కనబడుతోంది. ఎంతైనా విజయ................
ఆన్లైన్ క్లాసులు “చందూ” అంటూ మావారు మూడోసారి కేక వేయడంతో వంటింట్లో పని వదిలేసి పిలుపు వచ్చిన దిక్కుగా కదిలాను. హాల్లో మా 'బుడ్డాడు' బాసంపట్టు ఏసుకొని లాప్టాప్ ముందు కూర్చొని నెట్ కనెక్షన్ సరిగా ఉందో లేదో అని, నెట్ బాక్స్ వైపు, లాప్టాప్ వైపు ఆరాటంగా మార్చి మార్చి చూస్తున్నాడు. సీన్ కొంత అర్థమైంది. ఇవ్వాల్టి నుండి వాడికి ఆన్లైన్ క్లాసులు. వాడికి ఆన్లైన్ క్లాసులని తెలిసినప్పటి నుండి తెగ సంతోషపడుతూ తిన్మార్ డాన్స్లతో ఇల్లంతా సందడి చేస్తూ, నాన్న తనకు లాప్టాప్ ఇచ్చాడని చెల్లెల్ని ఊరించి ఊరించి ఉడికిస్తున్నాడు. బహుశా ఇప్పడు తన క్లాసులు డిస్టర్బ్ చెస్తుందని చెల్లెల్ని దగ్గరకు రానిచ్చి ఉండడు. పిలిచిన శాల్తీ ఎక్కడ ఉన్నాడని చూశాను. బాల్కానిలో వాష్ బేసిన్ వాలుకు తగిలించిన అద్దంలో ముఖం చూసుకుంటూ 'విజయ్' షేవింగ్ చేసుకుంటూ కనబడ్డాడు. అతన్ని కుదురుగా షేవింగ్ చేసుకోనీయకుండా 'చిట్టి' వాళ్ల నాన్న వేసుకున్న పొట్టి లాగు గుంజుతూ తనకూ లాప్టాప్ కావాలని ఏడుస్తోంది. నేను ఏడుస్తున్న చిట్టిని ఎత్తుకొని మావారి వైపు కోపంగా చూస్తూ.. దొరికిన అవకాశాన్ని విడవకుండా నేనందుకే ఇద్దరి పిల్లల్ని కనవద్దూ.. అంటే విన్నావు కాదూ. ఇప్పుడు చూడూ! దీనికి లాప్టాప్ ఎక్కడి నుంచి తెచ్చిస్తావు కాస్త విసురుగా అన్నాను. 'చిట్టి' ఏడ్చి ఏడ్చి దాని ముఖం మీద కన్నీళ్లు కాలువలా ప్రవహిస్తూ.. ముక్కు నుండి కారుతున్న జీవనదిలో కలిసిపోయి కలగాపులగంగా దారలు కట్టాయి. ఆ నల్లని మరకల, చారలతో దాని వర్చస్సు మురికిగా కనబడుతోంది. ఎంతైనా విజయ................© 2017,www.logili.com All Rights Reserved.