తెలుగు సామాజిక రంగాన కారంచేడు హత్యాకాండ భూమికలో రూపు దిద్దుకున్న దళిత స్త్రీవాద, బహుజన, మైనారిటీ, మాదిగ కవితోద్యమాల ప్రకంపనాల గురించి తెలుగు సాహిత్య చరిత్ర నమోదు చేసింది. వాటి తాకిడికి సంప్రదాయ, అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాలలో అలజడి మొదలై వాటిని ప్రభావితం చేసింది. ఈ క్రమాన తలెత్తిన తెలంగాణ సాహితీ, సాంస్కృతిక ఉద్యమ నేపథ్యాన తెలుగు సాహితీ సమరాంగణంలో అక్షరాలు ఆకాశాన ఒక కొత్తగొంతుక నెలవంకై పొడిచింది.
ఆ నెలవంకే కృష్ణా, గోదావరి నదీమ తల్లుల మధ్య కొండగుట్టలు, వాగులు, సమస్త జీవరాశికి నెలవై, పైరుపంటలకు తాపై డైనోసార్ల కాలం నుంచి ప్రాచీన నాగరికతకు, ఆదిమానవుల అవాసానికి నెలవై వెలిసిన వీర తెలంగాణ (సారాంశంలో భారతదేశాన) చరిత్ర సొరుగులలో కునారిల్లిపోతున్న అట్టడుగు వర్గాల ఆశలు, ఆకాంక్షలోంచి తలెత్తిన ఆ నెలవంక పేరు డాక్టర్ జిలుకర శ్రీనివాస్. పుట్టింది వీరతెలంగాణ సాయుధ పోరాటానికి ఆత్మవంటి పూర్వపు నల్లగొండ జిల్లాకు చెందిన జనగామ నడిబొడ్డులో. ఇప్పటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం. ఊరు మల్లంపల్లి. అలనాడు ఈ ఊరు సానువులలోనే ఈ కాలానికి వెయ్యి సంవత్సరాలకు ముందే అట్టడుగు వర్గాల పక్షం వహించిన ఒక మహానీయుడు పుట్టాడు. వీరశైవం దెబ్బకు బ్రాహ్మణాధిక్యతకు పట్టంకట్టి శూద్రులు బ్రాహ్మణులకు.....
తెలుగు సామాజిక రంగాన కారంచేడు హత్యాకాండ భూమికలో రూపు దిద్దుకున్న దళిత స్త్రీవాద, బహుజన, మైనారిటీ, మాదిగ కవితోద్యమాల ప్రకంపనాల గురించి తెలుగు సాహిత్య చరిత్ర నమోదు చేసింది. వాటి తాకిడికి సంప్రదాయ, అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాలలో అలజడి మొదలై వాటిని ప్రభావితం చేసింది. ఈ క్రమాన తలెత్తిన తెలంగాణ సాహితీ, సాంస్కృతిక ఉద్యమ నేపథ్యాన తెలుగు సాహితీ సమరాంగణంలో అక్షరాలు ఆకాశాన ఒక కొత్తగొంతుక నెలవంకై పొడిచింది. ఆ నెలవంకే కృష్ణా, గోదావరి నదీమ తల్లుల మధ్య కొండగుట్టలు, వాగులు, సమస్త జీవరాశికి నెలవై, పైరుపంటలకు తాపై డైనోసార్ల కాలం నుంచి ప్రాచీన నాగరికతకు, ఆదిమానవుల అవాసానికి నెలవై వెలిసిన వీర తెలంగాణ (సారాంశంలో భారతదేశాన) చరిత్ర సొరుగులలో కునారిల్లిపోతున్న అట్టడుగు వర్గాల ఆశలు, ఆకాంక్షలోంచి తలెత్తిన ఆ నెలవంక పేరు డాక్టర్ జిలుకర శ్రీనివాస్. పుట్టింది వీరతెలంగాణ సాయుధ పోరాటానికి ఆత్మవంటి పూర్వపు నల్లగొండ జిల్లాకు చెందిన జనగామ నడిబొడ్డులో. ఇప్పటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం. ఊరు మల్లంపల్లి. అలనాడు ఈ ఊరు సానువులలోనే ఈ కాలానికి వెయ్యి సంవత్సరాలకు ముందే అట్టడుగు వర్గాల పక్షం వహించిన ఒక మహానీయుడు పుట్టాడు. వీరశైవం దెబ్బకు బ్రాహ్మణాధిక్యతకు పట్టంకట్టి శూద్రులు బ్రాహ్మణులకు.....© 2017,www.logili.com All Rights Reserved.