స్వయంఉపాధి అవకాశాలకై గత 18సం.లుగా అధ్యయనం చేసిన వీరు 1999 సం.నుండి పూర్తిస్థాయి బిజినెస్ కన్సల్టెంట్‌గా ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు పరిశ్రమ లేదా వ్యాపార ప్రారంభానికి సమగ్రసేవలు అందిస్తున్నారు. కన్సల్టెన్సీసేవలు అందిస్తూ, యువతలో స్వయంఉపాధిమార్గాలు, అవకాశాలపట్ల అవగాహన కలిగించటం కోసం ప్రింట్‌మీడియాను సాధనంగా ఎంచుకొని, వివిధ దిన,వార,పక్ష, మాసపత్రికలలో ఇంతవరకు 400లకు పైగా వ్యాసాలు రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 2003సం. జులై నుండి ఇంతవరకు 240వారాలు వీరి వ్యాసాలు ప్రచురితమైనాయి. అంతేకాకుండా తేజ, ఈటీవీ-2 కార్యక్రమాలలో కూడా పాల్గొని ప్రేక్షకుల స్వయంఉపాధి సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
గత ఎనిమిది సంవత్సరాలలో 70కిపైగా పరిశ్రమల స్థాపనకు పూర్తిస్థాయి కన్సల్టెన్సీ సేవలు ఇవ్వటంతోపాటు దాదాపు 10వేలమందికి పరిశ్రమలేదా వ్యాపార ప్రారంభం, నిర్వహణకు సంబంధించిన సలహాలు ఇవ్వటం జరిగింది. వీరివ్యాసాల స్ఫూర్తి వల్ల సలహాలవల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది స్వయంఉపాధి అవకాశాలను యువత వినియోగించుకుంది.
2004 సం.లో జరిగిన రాష్ట్రసార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటుచేసిన ”ఎంప్లాయిమెంట్ జనరేషన్‌సెల్”కు జాయింట్ కన్వీనర్‌గా నియమించబడి, సమగ్రనివేదిక తయారుచెయ్యటంలో కీలకపాత్ర వహించారు. ఈ నివేదికలోని అనేక అంశాలను రాష్ట్రప్రభుత్వం అమలు చేసింది.
”ప్రస్తుతం దేశం మొత్తం జనాభాలో కష్టించి పనిచేయగల వయస్సులో వున్నవారి నిష్పత్తి గరిష్ఠస్థాయిలో వున్నది. ఈ స్థితిఎల్లకాలం వుండదు. అందువల్ల దేశంలో ”ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్‌ను ప్రోత్సహించటం ద్వారా అత్యధిక యువతను స్వయంఉపాధి మార్గాల ప్రారంభానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, సమాజంపై వున్న”దని నమ్మే మైనంపాటి శ్రీనివాసరావు తన కర్తవ్యంగా వ్యాసాలద్వారా, కన్సల్టెన్సీ సేవలను అందించటం ద్వారా తన వంతు కృషి చేస్తున్నారు.
స్వయంఉపాధి అవకాశాలకై గత 18సం.లుగా అధ్యయనం చేసిన వీరు 1999 సం.నుండి పూర్తిస్థాయి బిజినెస్ కన్సల్టెంట్‌గా ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు పరిశ్రమ లేదా వ్యాపార ప్రారంభానికి సమగ్రసేవలు అందిస్తున్నారు. కన్సల్టెన్సీసేవలు అందిస్తూ, యువతలో స్వయంఉపాధిమార్గాలు, అవకాశాలపట్ల అవగాహన కలిగించటం కోసం ప్రింట్‌మీడియాను సాధనంగా ఎంచుకొని, వివిధ దిన,వార,పక్ష, మాసపత్రికలలో ఇంతవరకు 400లకు పైగా వ్యాసాలు రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 2003సం. జులై నుండి ఇంతవరకు 240వారాలు వీరి వ్యాసాలు ప్రచురితమైనాయి. అంతేకాకుండా తేజ, ఈటీవీ-2 కార్యక్రమాలలో కూడా పాల్గొని ప్రేక్షకుల స్వయంఉపాధి సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలలో 70కిపైగా పరిశ్రమల స్థాపనకు పూర్తిస్థాయి కన్సల్టెన్సీ సేవలు ఇవ్వటంతోపాటు దాదాపు 10వేలమందికి పరిశ్రమలేదా వ్యాపార ప్రారంభం, నిర్వహణకు సంబంధించిన సలహాలు ఇవ్వటం జరిగింది. వీరివ్యాసాల స్ఫూర్తి వల్ల సలహాలవల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది స్వయంఉపాధి అవకాశాలను యువత వినియోగించుకుంది. 2004 సం.లో జరిగిన రాష్ట్రసార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటుచేసిన ”ఎంప్లాయిమెంట్ జనరేషన్‌సెల్”కు జాయింట్ కన్వీనర్‌గా నియమించబడి, సమగ్రనివేదిక తయారుచెయ్యటంలో కీలకపాత్ర వహించారు. ఈ నివేదికలోని అనేక అంశాలను రాష్ట్రప్రభుత్వం అమలు చేసింది. ”ప్రస్తుతం దేశం మొత్తం జనాభాలో కష్టించి పనిచేయగల వయస్సులో వున్నవారి నిష్పత్తి గరిష్ఠస్థాయిలో వున్నది. ఈ స్థితిఎల్లకాలం వుండదు. అందువల్ల దేశంలో ”ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్‌ను ప్రోత్సహించటం ద్వారా అత్యధిక యువతను స్వయంఉపాధి మార్గాల ప్రారంభానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, సమాజంపై వున్న”దని నమ్మే మైనంపాటి శ్రీనివాసరావు తన కర్తవ్యంగా వ్యాసాలద్వారా, కన్సల్టెన్సీ సేవలను అందించటం ద్వారా తన వంతు కృషి చేస్తున్నారు.Very Good
© 2017,www.logili.com All Rights Reserved.