1951లో "దీక్ష" లో మొదటి పాట రాసినప్పటి నుంచీ 1989 వరకు ఆత్రేయ జీవితం ఒక నిరంతరం స్రోతస్విని. 38 సంవత్సరాలు తెలుగు జన జీవనంతో మమేకమయి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అదొక మహప్రస్థానం. ఆత్రేయ కోసం తహతహలాడే ప్రోడ్యుసర్లు, ఆయన డిక్టేట్ చేస్తే వ్రాయడానికి సిద్ధంగా వున్న అసిస్టెంటు డైరెక్టర్లు, ఒక్క అక్షరం రాసినా నెత్తిమీద పెట్టుకుని మురిసిపోయే అభిమానులు, ఆయనకి డబ్బు యిచ్చినందుకే గర్వంగా చెప్పుకొనే నిర్మతలు, రాయని అతని బద్దకాన్ని, రాశాక ఆ రచనలో ఘనతని కధలుగా చెప్పుకొనే అభిమానులు, ఆయన అక్రమశిక్షణకి తలవొంచే వ్యాపారులు, ఆయన బద్దకాన్ని కొత్త ఆలోచనకు అన్వేషణగా సమర్ధించుకొనే హంగుదారులు, కావాలంటే మీదపడే డబ్బు, రాయకపోయినా ఎప్పటికయినా రాస్తాడని సరిపెట్టుకునే దర్శకులు, మాట నిలబెట్టుకోని దాట వేత ఒక మేధావి స్వభావంగా సరిపెట్టుకునేవారు, ఆయన రాసిందే వేదమని నమ్మేవారు, పాటలో ఆత్రేయ ముద్రకి వేదికేవాళ్ళు,ఆయన్ని పరోక్షంగా తిట్టి పాటకి పట్టం గట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అడుగులకు మడుగులోత్తేవాళ్లు - అదొక ముమ్మరం.
ఆత్రేయ చెప్పిందే వేదమయింది. అది వేదం అయితేగాని ఆత్రేయ చెప్పేవాడు కాదు. ప్రజలనాడిని ఆపోశన పట్టిన అద్బుతమైన దశ అది. కవులు ఈర్ష్యపడేంత గంభీరమైన జీవనాన్ని గడిపి, సాహితీ లోకం గర్వపడేంత అర్ర్ధమైన రచనలందజేసి, చరిత్రలో తనదైన స్ధానాన్ని మిగుల్చుకుని సెలవు తీసుకున్న ఆచార్య ఆత్రేయ తన చరమగగీతాన్నిepitaph తానే రాసుకున్నాడు.
గొల్లపూడి మారుతిరావు
1951లో "దీక్ష" లో మొదటి పాట రాసినప్పటి నుంచీ 1989 వరకు ఆత్రేయ జీవితం ఒక నిరంతరం స్రోతస్విని. 38 సంవత్సరాలు తెలుగు జన జీవనంతో మమేకమయి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అదొక మహప్రస్థానం. ఆత్రేయ కోసం తహతహలాడే ప్రోడ్యుసర్లు, ఆయన డిక్టేట్ చేస్తే వ్రాయడానికి సిద్ధంగా వున్న అసిస్టెంటు డైరెక్టర్లు, ఒక్క అక్షరం రాసినా నెత్తిమీద పెట్టుకుని మురిసిపోయే అభిమానులు, ఆయనకి డబ్బు యిచ్చినందుకే గర్వంగా చెప్పుకొనే నిర్మతలు, రాయని అతని బద్దకాన్ని, రాశాక ఆ రచనలో ఘనతని కధలుగా చెప్పుకొనే అభిమానులు, ఆయన అక్రమశిక్షణకి తలవొంచే వ్యాపారులు, ఆయన బద్దకాన్ని కొత్త ఆలోచనకు అన్వేషణగా సమర్ధించుకొనే హంగుదారులు, కావాలంటే మీదపడే డబ్బు, రాయకపోయినా ఎప్పటికయినా రాస్తాడని సరిపెట్టుకునే దర్శకులు, మాట నిలబెట్టుకోని దాట వేత ఒక మేధావి స్వభావంగా సరిపెట్టుకునేవారు, ఆయన రాసిందే వేదమని నమ్మేవారు, పాటలో ఆత్రేయ ముద్రకి వేదికేవాళ్ళు,ఆయన్ని పరోక్షంగా తిట్టి పాటకి పట్టం గట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అడుగులకు మడుగులోత్తేవాళ్లు - అదొక ముమ్మరం. ఆత్రేయ చెప్పిందే వేదమయింది. అది వేదం అయితేగాని ఆత్రేయ చెప్పేవాడు కాదు. ప్రజలనాడిని ఆపోశన పట్టిన అద్బుతమైన దశ అది. కవులు ఈర్ష్యపడేంత గంభీరమైన జీవనాన్ని గడిపి, సాహితీ లోకం గర్వపడేంత అర్ర్ధమైన రచనలందజేసి, చరిత్రలో తనదైన స్ధానాన్ని మిగుల్చుకుని సెలవు తీసుకున్న ఆచార్య ఆత్రేయ తన చరమగగీతాన్నిepitaph తానే రాసుకున్నాడు. గొల్లపూడి మారుతిరావు© 2017,www.logili.com All Rights Reserved.