చీకటిలో చీలికలు
సాయంకాలపు చల్లదనాన్ని మరచిపోలేక రాత్రి ఆకాశం వణుకుతూ, ఒగరుస్తోంది. ఏదో పేరుతెలీని పిట్ట అరుపు నిశికడుపులో తిరిగి విసుగు కలిగిస్తోంది. నిశ్చలమయిన రాత్రి -
చిక్కటి చీకటులు వొళ్ళంతా పూసుకొని, సహనంతో తలవొంచి, నక్షత్రాల నిరీక్షణలో నిలిచే రాత్రి -
. కాలికింద ఎండుపుల్ల పుటుక్కుమనే సరికి తుళ్ళిపడ్డాడు విశ్వేశ్వరం. భయమంటే ఎరగని గుండె, చీకటి తెరల్లో రెపరెపలాడింది.
ఎనిమిదేళ్ళ కిందటి పుంత. ఎరిగిన తోవయినా అలవాటు లేకపోవడం వల్ల దారి తప్పుతున్నాడు. మొగలిడొంకలూ, గుబుర్లు అడ్డు వస్తున్నాయి. నిశీధిలో నీడలా సాగిపోతున్న విశ్వేశ్వరం సగంత్రోవ గడిచాక ఒక్కసారి ఆగిపోయాడు ఏదో ఆలోచన తోచి -
ఇంతరాత్రిలో - ఇలాంటి రాత్రిలో అక్కడికి వెళ్ళడం మంచిదా అనుకున్నాడు. బుద్ధి వెనక్కు లాగింది. మనస్సు పీకుతోంది. ఎక్కడో పేగు కదిలింది.... రక్తమంతా వణికి ఒక్కసారి పొంగి మెదడులోకి ప్రాకింది.
దూరంగా యిల్లు కనిపిస్తోంది. ఏళ్ళు గడిచినా, ప్రపంచం మారినా ఆ యిల్లు మారలేదు................
చీకటిలో చీలికలు సాయంకాలపు చల్లదనాన్ని మరచిపోలేక రాత్రి ఆకాశం వణుకుతూ, ఒగరుస్తోంది. ఏదో పేరుతెలీని పిట్ట అరుపు నిశికడుపులో తిరిగి విసుగు కలిగిస్తోంది. నిశ్చలమయిన రాత్రి - చిక్కటి చీకటులు వొళ్ళంతా పూసుకొని, సహనంతో తలవొంచి, నక్షత్రాల నిరీక్షణలో నిలిచే రాత్రి - . కాలికింద ఎండుపుల్ల పుటుక్కుమనే సరికి తుళ్ళిపడ్డాడు విశ్వేశ్వరం. భయమంటే ఎరగని గుండె, చీకటి తెరల్లో రెపరెపలాడింది. ఎనిమిదేళ్ళ కిందటి పుంత. ఎరిగిన తోవయినా అలవాటు లేకపోవడం వల్ల దారి తప్పుతున్నాడు. మొగలిడొంకలూ, గుబుర్లు అడ్డు వస్తున్నాయి. నిశీధిలో నీడలా సాగిపోతున్న విశ్వేశ్వరం సగంత్రోవ గడిచాక ఒక్కసారి ఆగిపోయాడు ఏదో ఆలోచన తోచి - ఇంతరాత్రిలో - ఇలాంటి రాత్రిలో అక్కడికి వెళ్ళడం మంచిదా అనుకున్నాడు. బుద్ధి వెనక్కు లాగింది. మనస్సు పీకుతోంది. ఎక్కడో పేగు కదిలింది.... రక్తమంతా వణికి ఒక్కసారి పొంగి మెదడులోకి ప్రాకింది. దూరంగా యిల్లు కనిపిస్తోంది. ఏళ్ళు గడిచినా, ప్రపంచం మారినా ఆ యిల్లు మారలేదు................© 2017,www.logili.com All Rights Reserved.