వరూధినిప్రవరాఖ్యుల సంవాద పరిణామ క్రమాన్ని గమనిస్తే, వరూధిని ముందు ప్రవరుడిని తన అందంతో వశం చేసుకోవాలనుకుంది । కుదరలేదు। అతడే తన వెంట పడేలా చేసుకోవాలనుకుంది। సాధ్యపడలేదు। అతడి చేతనే మొదటి మాట పలికించాలనుకుంది। అది కుదరలేదు। చివరికి తానే మనస్సులో ఉన్న మాటని బయటపెట్టింది। అయినా ప్రవరుడు లొంగలేదు। ఎన్నో ఆకర్షణలు చూపించింది। పాచికలు పారలేదు। వాక్చాతుర్యం ప్రదర్శించింది। పప్పులు ఉడకలేదు। చిట్టచివరిగా అతడి పై అబాంఢాలు వేసి, నేరారోపణ ప్రయత్నం కూడా చేసింది। అయినా ప్రవరుడి గుండె నిబ్బరం చెదరలేదు। ఇక లాభం లేదని భావించి తనపై దయ చూపించమని ప్రాధేయపడింది। ప్రవరుడు జాలి కూడా చూపించలేదు।
మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా అంతే। మనోనిగ్రహం మన ఆయుధమైతే ఎటువంటి సమస్య అయినా సరే, మన గుండె నిబ్బరం చూసి చెదిరిపోవాల్సిందే।