అందం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం... దానిని మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం. ఉదా: మన చిన్నప్పుడు అమ్మ వారానికి మూడు సార్లు కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించేది. ఇప్పుడు రోజు రోజుకు మారుతున్న అలవాట్ల వళ్ళ సరిగా స్నానం కూడా చేయలేకపోతున్నాం. చక్కగా తలకు ఆముదం రాసుకుని వేడి వేడినీళ్ళుపోసుకుంటే వచ్చే హాయి మాటల్లో చెప్పలేం. అలా అని మన పనులను మానుకోమని కాదు. రోజుకు మన కోసం ఒక అరగంట సేపు కేటాయించండి. మనలో మనకు తెలియని ఇంత అందం ఉందా అనిపిస్తుంది.
అందం అనేది ఒక పదం. దానికి నిర్వచనం కొండంత. ఒకరు నల్లగా ఉంటారు. వారికి కొంచెం మేకప్ సొగసులు చేరిస్తే వారుకూడా నేను ఇంత అందంగా ఉంటానా అనుకుంటారు. తెల్లగా ఉన్నవారు నేను చాలా తెల్లగా ఉంటాను కదా నాకు మేకప్ అవసరం లేదు అనుకుంటారు. శరీరం మాత్రమే తెల్లగా ఉంటే సరిపోదు. తల నుంచి పాదాల వరకు అందంగా ఉంటేనే మనం అందంగా ఉన్నట్లు లెక్క. మనకు తెలియని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం కూడా అందంగా ఉంటాం.
ప్రస్తుతం పోటి ప్రపంచంలో అందంగా కనిపించడం చాలా అవసరం. కానీ అందంగా కనిపించడం కోసం ఎంత సమయం, ఇంకా ఎంతో ధనం వృధా అవుతున్నాయి. అందుకే ఈ బ్యూటీ గైడ్. ఈ పుస్తకం మీ చేతిలో ఉంటే అందం మీ చేతిలోనే...
- కె శ్రీలక్ష్మి
అందం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం... దానిని మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం. ఉదా: మన చిన్నప్పుడు అమ్మ వారానికి మూడు సార్లు కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించేది. ఇప్పుడు రోజు రోజుకు మారుతున్న అలవాట్ల వళ్ళ సరిగా స్నానం కూడా చేయలేకపోతున్నాం. చక్కగా తలకు ఆముదం రాసుకుని వేడి వేడినీళ్ళుపోసుకుంటే వచ్చే హాయి మాటల్లో చెప్పలేం. అలా అని మన పనులను మానుకోమని కాదు. రోజుకు మన కోసం ఒక అరగంట సేపు కేటాయించండి. మనలో మనకు తెలియని ఇంత అందం ఉందా అనిపిస్తుంది. అందం అనేది ఒక పదం. దానికి నిర్వచనం కొండంత. ఒకరు నల్లగా ఉంటారు. వారికి కొంచెం మేకప్ సొగసులు చేరిస్తే వారుకూడా నేను ఇంత అందంగా ఉంటానా అనుకుంటారు. తెల్లగా ఉన్నవారు నేను చాలా తెల్లగా ఉంటాను కదా నాకు మేకప్ అవసరం లేదు అనుకుంటారు. శరీరం మాత్రమే తెల్లగా ఉంటే సరిపోదు. తల నుంచి పాదాల వరకు అందంగా ఉంటేనే మనం అందంగా ఉన్నట్లు లెక్క. మనకు తెలియని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం కూడా అందంగా ఉంటాం. ప్రస్తుతం పోటి ప్రపంచంలో అందంగా కనిపించడం చాలా అవసరం. కానీ అందంగా కనిపించడం కోసం ఎంత సమయం, ఇంకా ఎంతో ధనం వృధా అవుతున్నాయి. అందుకే ఈ బ్యూటీ గైడ్. ఈ పుస్తకం మీ చేతిలో ఉంటే అందం మీ చేతిలోనే... - కె శ్రీలక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.