భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశపు ఔన్నత్యం. ఎన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో భాషలు. భాషలు బహుళం అయినా భావం ఏకం. ఆచార వ్యవహారాలూ, సాంప్రదాయాలు, సుఖసౌఖ్యాలు అనేకం. కనీ ఇక్కట్లు, ఇబ్బందులు, బాధలు మాత్రం ఒకటే.
సెల్ ఫోన్, కంప్యూటర్ పరిజ్ఞానం పురోగమించిన ఈ రోజులలో ప్రపంచం. మన కండ్లముందే కదలాడుతుంది. అయినా నేటి మానవుడు బ్రతుకుదెరువు బాటసారి. బహుళ విషయ విజ్ఞాన ఆసక్తుడు. నేర్చినది మఱ్ఱి విత్తంత. నేర్వవలసినది ఆ వృక్షమంత. ఉదర పోషణార్థం ఉద్యోగాన్వేషణ, ఉద్యోగ నిర్వహణ నిమిత్తం ఏ ప్రాంతానికైనా అతని పయనం ఆవశ్యం. అవసరార్థం ఆయా ప్రాంతాల భాషల లిపి, సంభాషణల తీరుతెన్నులు తెలుసుకోవడం అత్యంత అవసరం. అన్ని భాషలూ ఒకేసారి నేర్వడం వీలుకానందున, కనీసం కొన్ని భాషలు నేర్చుకొనడం లేదా ఆయా భాషల లిపి, పదాలపై ప్రాథమిక అవగాహన ఎంతయూ వాంఛనీయము.
ఆ విషయం దృష్ట్యా మన మాతృభాష తెలుగు భాషకు ప్రాధాన్యత సంతరింపజేస్తూ, అంతర్జాతీయ భాషయైన ఆంగ్లభాష, జాతీయ భాషయైన హిందీ, ఇతర దక్షిణ భారతదేశ భాషలయిన తమిళం, కన్నడం మరియు మలయాళంలందు గల అంశములను వర్గీకరణ చేసి, పండితులే కాక పామరులు సైతం అర్థం చేసుకోగలందులకు నూతన తరహాలో ఈ పుస్తక సంకలనం జరిగింది. వ్యాకరణాంశాములు కొన్ని మాత్రమే చేర్చబడినవి.
భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశపు ఔన్నత్యం. ఎన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో భాషలు. భాషలు బహుళం అయినా భావం ఏకం. ఆచార వ్యవహారాలూ, సాంప్రదాయాలు, సుఖసౌఖ్యాలు అనేకం. కనీ ఇక్కట్లు, ఇబ్బందులు, బాధలు మాత్రం ఒకటే. సెల్ ఫోన్, కంప్యూటర్ పరిజ్ఞానం పురోగమించిన ఈ రోజులలో ప్రపంచం. మన కండ్లముందే కదలాడుతుంది. అయినా నేటి మానవుడు బ్రతుకుదెరువు బాటసారి. బహుళ విషయ విజ్ఞాన ఆసక్తుడు. నేర్చినది మఱ్ఱి విత్తంత. నేర్వవలసినది ఆ వృక్షమంత. ఉదర పోషణార్థం ఉద్యోగాన్వేషణ, ఉద్యోగ నిర్వహణ నిమిత్తం ఏ ప్రాంతానికైనా అతని పయనం ఆవశ్యం. అవసరార్థం ఆయా ప్రాంతాల భాషల లిపి, సంభాషణల తీరుతెన్నులు తెలుసుకోవడం అత్యంత అవసరం. అన్ని భాషలూ ఒకేసారి నేర్వడం వీలుకానందున, కనీసం కొన్ని భాషలు నేర్చుకొనడం లేదా ఆయా భాషల లిపి, పదాలపై ప్రాథమిక అవగాహన ఎంతయూ వాంఛనీయము. ఆ విషయం దృష్ట్యా మన మాతృభాష తెలుగు భాషకు ప్రాధాన్యత సంతరింపజేస్తూ, అంతర్జాతీయ భాషయైన ఆంగ్లభాష, జాతీయ భాషయైన హిందీ, ఇతర దక్షిణ భారతదేశ భాషలయిన తమిళం, కన్నడం మరియు మలయాళంలందు గల అంశములను వర్గీకరణ చేసి, పండితులే కాక పామరులు సైతం అర్థం చేసుకోగలందులకు నూతన తరహాలో ఈ పుస్తక సంకలనం జరిగింది. వ్యాకరణాంశాములు కొన్ని మాత్రమే చేర్చబడినవి.
© 2017,www.logili.com All Rights Reserved.