తేనెలొలుకు మన తెలుగు భాష పట్ల అనేక కరణముల మూలముగా అవగాహన, అభిలాష నానాటికీ తగ్గుతున్నవి. అయిననూ మన మాతృభాషను మరువకూడదు, మరుగున పడనీయరాడు. అందువలన ప్రతి రచయిత, కవి, గ్రంథకర్త తెలుగు భాషా కీర్తి ఆచంద్రతారర్కముగా నిలుచుటకునూ, జగజ్జేగీయమానముగా శోభింపజేయుటకునూ తన వంతుగా వివిధ ప్రక్రియలలో మన తెలుగు భాషను పాఠకులకు విరివిగా అందజేయుట ఆవశ్యకము.
ఆ ఉద్దేశంతో నేటి యువతకు, తెలుగు భాషా ప్రయోక్తలకు, పోషకులకు, విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయుక్తముగా ఉండు నిమిత్తము ఈ కోశమును రూపొందించడమైనది.
స్థూలముగ వ్యతిరేకార్థక పదములను ఈ విధముగా వర్గీకరించితిని. భావభేదము, క్రియాభేదము, లింగభేదము, దశ, దిశా భేదము, గుణభేదము, కాలభేదము, ఇతర భేదములు. పైన ఉదాహరించిన వర్గీకరణల విధముగా వ్రాయ తొలుదొలుత సంకల్పించితిని. కానీ, జిజ్ఞాసువు తనకు కావలసిన పదము కొరకై పుస్తకమంతయు వెదకుకొనకుండ, తన ఉద్దిష్ట పదమును త్వరితముగ గ్రహించగలందుకులగాను, శబ్దాన్వేషణ సులభము, సుగమము చేయు నిమిత్తం అకారాది క్రమములోని పొందుపరచితిని.
తేనెలొలుకు మన తెలుగు భాష పట్ల అనేక కరణముల మూలముగా అవగాహన, అభిలాష నానాటికీ తగ్గుతున్నవి. అయిననూ మన మాతృభాషను మరువకూడదు, మరుగున పడనీయరాడు. అందువలన ప్రతి రచయిత, కవి, గ్రంథకర్త తెలుగు భాషా కీర్తి ఆచంద్రతారర్కముగా నిలుచుటకునూ, జగజ్జేగీయమానముగా శోభింపజేయుటకునూ తన వంతుగా వివిధ ప్రక్రియలలో మన తెలుగు భాషను పాఠకులకు విరివిగా అందజేయుట ఆవశ్యకము. ఆ ఉద్దేశంతో నేటి యువతకు, తెలుగు భాషా ప్రయోక్తలకు, పోషకులకు, విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయుక్తముగా ఉండు నిమిత్తము ఈ కోశమును రూపొందించడమైనది. స్థూలముగ వ్యతిరేకార్థక పదములను ఈ విధముగా వర్గీకరించితిని. భావభేదము, క్రియాభేదము, లింగభేదము, దశ, దిశా భేదము, గుణభేదము, కాలభేదము, ఇతర భేదములు. పైన ఉదాహరించిన వర్గీకరణల విధముగా వ్రాయ తొలుదొలుత సంకల్పించితిని. కానీ, జిజ్ఞాసువు తనకు కావలసిన పదము కొరకై పుస్తకమంతయు వెదకుకొనకుండ, తన ఉద్దిష్ట పదమును త్వరితముగ గ్రహించగలందుకులగాను, శబ్దాన్వేషణ సులభము, సుగమము చేయు నిమిత్తం అకారాది క్రమములోని పొందుపరచితిని.© 2017,www.logili.com All Rights Reserved.