కొన్ని విత్తనముల విక్రయమునకు, మరియు సంబంధిత ఇతర విషయములలో వాటి నాణ్యతలో క్రమబద్ధీకరణ కావించుటకు యేర్పడిన చట్టమే విత్తనముల చట్టము, 1966-1966లో 54వ చట్టము. “విత్తనము' అనగా విత్తుటకు, లేక నాటుటకు ఉపయోగించునది. దిగువ పేర్కొనబడిన విత్తనములలో ఏ విభాగముకైనా చెందినదిగా చట్టములోని సెక్షన్ 2(11)లో ''విత్తనము నిర్వచింపబడినది. అట్టి విత్తన విభాగములు 1. నూనె గింజలు, పండ్ల గింజలు మరియు కూరగాయ గింజలతో సహా ఆహార పంటల గింజలు 2. ప్రతీ గింజలు 3. పశుగ్రాసము యొక్క గింజలు 4. జనపనార గింజలు మరియు మొలకలు, దుంపలు, గడ్డలు, వేరులు, అంటుకట్టు మరియు యితర వృక్షజాతి వ్యాప్తి కొరకుండు ఆహార పంటలు లేక పశుగ్రాసమునకు సంబంధించినవి యిందులో చేరుతాయి. 1978 ఎం. పి.యల్. జె. 727.
(డిసెంబరు 29, 1966)
కొన్ని విత్తనముల విక్రయమునకు, మరియు సంబంధిత యితర విషయములలో వాటి నాణ్యతలో క్రమబద్ధీకరణ చేయుటకు యేర్పాటయిన చట్టము, పదిహేడవ గణతంత్ర సంవత్సరములో పార్లమెంటుచే యీ క్రింది విధముగా నున్నది.
© 2017,www.logili.com All Rights Reserved.