సివిల్ న్యాయశాస్త్రములో "లా ఆఫ్ ఇన్ జన్ క్షన్స్" గా వ్యవహరింపబడే నిషేధపుటుత్తర్వులకు విశేష ప్రాధాన్యత ఉన్నది. భూమి తగాదాలు, వ్యక్తిగత సౌఖ్యానికి సంబంధించి హక్కులు, ఈజ్ మెంటరి హక్కులు, ట్రేడ్ మార్క్ హక్కులు మొదలుగా గల అనేక రకాల హక్కులు నిషేధపుటుత్తుర్వులకు పరిధిలోకి వస్తాయి. వ్యక్తుల ప్రాధమిక హక్కులకు, నిషేధపుటుత్తర్వులకు సంబంధించిన శాసనములను గురించి కూడా సామాన్య ప్రజానీకము తెలుసుకోనవలసిన అగత్యము ఎంతైనా ఉన్నది. ప్రత్యేకించి పర్యావరణ కాలుష్యము రోజురోజుకి పెరిగిపోయి జనజీవనానికి, ఆరోగ్యవంతమైన నేటి పరిస్థితులలో నిషేధపుటుత్తర్వుల ద్వారా ఆ ప్రమాదమును నివారించవలసిన బాధ్యత మనందరిపైనా ఉన్నది.
నిషేధపుటుత్తర్వులకు సంబంధించిన శాసన నిబంధనలు అన్నీ ఒకే శాసనములో లేవు. అందువలన విభిన్న శాసనములలోని నిబంధనలను క్రోడీకరించి ఈ గ్రంథ రచన చేయటం జరిగింది. వ్యక్తులకు గల ప్రాధమిక హక్కుల గురించి, వాటి ఉల్లంఘన జరిగినప్పుడు నిషేధపుటుత్తర్వుల ద్వారా తగిన ఉపశమనము పొందుట గురించి, సరళమైన తెలుగులో వివరించే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. ఆ క్రమంలో న్యాయస్థానముల పరిధి, అధికారములు పరిమితులను కూడా సోదాహరణముగా వివరించటం జరిగింది.
అతి తక్కువ కోర్టుఫీజుతో చక్కటి ఉపశమనాన్ని నిషేధపుటుత్తర్వుల ద్వారా పొందవచ్చు. అందువలన కోర్టుఫీజు చట్టానికి సంబంధించిన కూడా ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది.
న్యాయశాస్త్ర గ్రంధాలను ఆంధ్రీకరించి న్యాయ విజ్ఞానాన్ని సామాన్య ప్రజానీకానికి అందచేయాలనే నా ప్రయత్నంలో భాగమే ఈ నిషేధపుటుత్తర్వులు. ఇప్పటి వరకు నాచే ఆంధ్రీకరించబడిన తెలుగు న్యాయ విజ్ఞాన గ్రంధాలను ఆదరించిన విధముగానే ఈ "నిషేధపుటుత్తర్వులు" అనే పుస్తకాన్ని కూడా పాఠకులు ఆదరించగలరనే నా ఆకాంక్ష. నిషేధపుటుత్తర్వుల గురించి కనీస అవగాహన ఏర్పరచటంలో తెలుగుపాఠకులకు ఈ పుస్తకము తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తూ....
- పెండ్యాల సత్యనారాయణ
సివిల్ న్యాయశాస్త్రములో "లా ఆఫ్ ఇన్ జన్ క్షన్స్" గా వ్యవహరింపబడే నిషేధపుటుత్తర్వులకు విశేష ప్రాధాన్యత ఉన్నది. భూమి తగాదాలు, వ్యక్తిగత సౌఖ్యానికి సంబంధించి హక్కులు, ఈజ్ మెంటరి హక్కులు, ట్రేడ్ మార్క్ హక్కులు మొదలుగా గల అనేక రకాల హక్కులు నిషేధపుటుత్తుర్వులకు పరిధిలోకి వస్తాయి. వ్యక్తుల ప్రాధమిక హక్కులకు, నిషేధపుటుత్తర్వులకు సంబంధించిన శాసనములను గురించి కూడా సామాన్య ప్రజానీకము తెలుసుకోనవలసిన అగత్యము ఎంతైనా ఉన్నది. ప్రత్యేకించి పర్యావరణ కాలుష్యము రోజురోజుకి పెరిగిపోయి జనజీవనానికి, ఆరోగ్యవంతమైన నేటి పరిస్థితులలో నిషేధపుటుత్తర్వుల ద్వారా ఆ ప్రమాదమును నివారించవలసిన బాధ్యత మనందరిపైనా ఉన్నది. నిషేధపుటుత్తర్వులకు సంబంధించిన శాసన నిబంధనలు అన్నీ ఒకే శాసనములో లేవు. అందువలన విభిన్న శాసనములలోని నిబంధనలను క్రోడీకరించి ఈ గ్రంథ రచన చేయటం జరిగింది. వ్యక్తులకు గల ప్రాధమిక హక్కుల గురించి, వాటి ఉల్లంఘన జరిగినప్పుడు నిషేధపుటుత్తర్వుల ద్వారా తగిన ఉపశమనము పొందుట గురించి, సరళమైన తెలుగులో వివరించే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. ఆ క్రమంలో న్యాయస్థానముల పరిధి, అధికారములు పరిమితులను కూడా సోదాహరణముగా వివరించటం జరిగింది. అతి తక్కువ కోర్టుఫీజుతో చక్కటి ఉపశమనాన్ని నిషేధపుటుత్తర్వుల ద్వారా పొందవచ్చు. అందువలన కోర్టుఫీజు చట్టానికి సంబంధించిన కూడా ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది. న్యాయశాస్త్ర గ్రంధాలను ఆంధ్రీకరించి న్యాయ విజ్ఞానాన్ని సామాన్య ప్రజానీకానికి అందచేయాలనే నా ప్రయత్నంలో భాగమే ఈ నిషేధపుటుత్తర్వులు. ఇప్పటి వరకు నాచే ఆంధ్రీకరించబడిన తెలుగు న్యాయ విజ్ఞాన గ్రంధాలను ఆదరించిన విధముగానే ఈ "నిషేధపుటుత్తర్వులు" అనే పుస్తకాన్ని కూడా పాఠకులు ఆదరించగలరనే నా ఆకాంక్ష. నిషేధపుటుత్తర్వుల గురించి కనీస అవగాహన ఏర్పరచటంలో తెలుగుపాఠకులకు ఈ పుస్తకము తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తూ.... - పెండ్యాల సత్యనారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.