భండారి అంకయ్యగారు చేసిన సాహస రచన ఈ రాజ్యాంగ శిల్పి అనే రూపకం. కేవలం పది ఘట్టాలలో అంబేద్కర్ జీవిత చరిత్రను కుదించడం, రూపకంలోకి దించడం సాధారణంగా సాధ్యమయ్యే పని కాదు. భండారి అంకయ్య గారు అంతటి మహాసాగరం వంటి జీవితంలోంచి కావలసిన దోసెడు నీళ్ళను మనకు రూపకం రూపంలో అందించారు. అనేకానేక పరిశోధనా గ్రంథాలు, తలదిండు ప్రమాణంలో ఉండే పుస్తాకాలు, ఆయన ప్రసంగాల సంపుటాలు, రచనల సమగ్ర సంపుటాలు చేయని పని, అంతకన్నా గొప్పపని అంకయ్య గారి రూపకం చేయగలుగుతుంది.
సంక్షిప్తమైన అంశాలను సరళంగా చెప్పడం చాలా కష్టమైనా పని. ఆ పని సునాయాసంగా అంకయ్య గారు చేశారు. అంబేద్కర్ పోరాట జీవనం చాలా సులువుగా అర్థమయ్యే ప్రక్రియ ఈ రూపకం. రాజ్యాంగ రచనా సభాఘట్టాన్ని చేర్చడం, చివరకు భారత రాజ్యాంగ ముఖ్యాంశాలను పరిచయం మరింత పెంచింది.
- మాడభూషి శ్రీధర్
భండారి అంకయ్యగారు చేసిన సాహస రచన ఈ రాజ్యాంగ శిల్పి అనే రూపకం. కేవలం పది ఘట్టాలలో అంబేద్కర్ జీవిత చరిత్రను కుదించడం, రూపకంలోకి దించడం సాధారణంగా సాధ్యమయ్యే పని కాదు. భండారి అంకయ్య గారు అంతటి మహాసాగరం వంటి జీవితంలోంచి కావలసిన దోసెడు నీళ్ళను మనకు రూపకం రూపంలో అందించారు. అనేకానేక పరిశోధనా గ్రంథాలు, తలదిండు ప్రమాణంలో ఉండే పుస్తాకాలు, ఆయన ప్రసంగాల సంపుటాలు, రచనల సమగ్ర సంపుటాలు చేయని పని, అంతకన్నా గొప్పపని అంకయ్య గారి రూపకం చేయగలుగుతుంది. సంక్షిప్తమైన అంశాలను సరళంగా చెప్పడం చాలా కష్టమైనా పని. ఆ పని సునాయాసంగా అంకయ్య గారు చేశారు. అంబేద్కర్ పోరాట జీవనం చాలా సులువుగా అర్థమయ్యే ప్రక్రియ ఈ రూపకం. రాజ్యాంగ రచనా సభాఘట్టాన్ని చేర్చడం, చివరకు భారత రాజ్యాంగ ముఖ్యాంశాలను పరిచయం మరింత పెంచింది. - మాడభూషి శ్రీధర్© 2017,www.logili.com All Rights Reserved.