కొంత కాలం కిందట - నాలుగో ఫారం అయిదో ఫారం చదివేటప్పుడు - వాడుక భాషను చులకనగా చూసేవాణ్ణి। నేను తరువాత కాలేజిలో ప్రవేశించినప్పుడు భారతి మొదలైన మాసపత్రికల్లొ వాడుకభాషలో రాయబడ్డవి చాలా అందమైన వ్యాసాలు చదివాను। నా మనసు వాడుకభాషకు గ్రాంధికభాషకూ మధ్య ఊగుతున్న సమయంలో గిడుగు రామమూర్తి పంతులు గారు మా హాస్టలుకు దయచెయ్యటం కాలేజీలో ఉపన్యాసం ఇవ్వటo జరిగినై। అప్పుడే వారు అట్టిడు అనే పదానికి ద్వితియావిభక్తి బాహువచనం ఎవరైనా చెప్పగలిగితే తమ ప్రయాత్నమంతా మానేసి గ్రాంథికభాషాసేవ చేస్తానని ఛాలెంజ్ చేశారు। ఆ రోజునుంచి నాకు గ్రాంధిక భాష మీద అభిమానం పోయింది। కానీ ఆప్పటి నుంచి ఇప్పుటి వరకు ఒక సంశయం ఉండనే ఉంది।

Features
: Kodavatiganti kutumbarao Rachana Prapancham (volume16B- Second Part)