భారతీయ సంగీత శాస్త్ర చరిత్ర గురించి నేనొక పుస్తకం రాస్తాననీ, రాయాల్సి వస్తుందనీ పదేళ్ళ క్రిందటి వరకూ ఎన్నడూ అనుకోలేదు. సంగీత సంబంధమైన గ్రంథాలు, వ్యాసాలూ ఇంగ్లీషులో, తెలుగులో, ఇతర భాషలలో ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో కొన్ని హిందూస్థానీ సంగీతం గురించినవి. మరికొన్ని కర్ణాటక సంగీతం గురించినవి. ఈ రెండూ ఒకే గొప్ప సంగీత వ్యవస్థకు చెందిన శాఖలు.
వాటి మధ్య గాయన శైలీ భేదం తప్ప ఇతరాత్ర పెద్దగా తేడాలు లేవు. ఉన్న కొద్ది తేడాలు కూడా 14వ శతాబ్దంలో పొరపాటుగానో, ఉద్దేశపూర్వకంగా సంగీత వ్యాకరణంలోకి కృత్రిమంగా చొప్పించబడినవి. ఈ దృష్టితో మొత్తం భారతీయ సంగీతం గురించి రచించిన గ్రంథాలు కనిపించవు. ఎప్పుడో వందేళ్ళక్రిందట విష్ణునారాయణ్ భాత్ఖండేగారు 15 - 18 శతాబ్దాల మధ్యకాలంలో వెలువడిన కొన్ని ముఖ్యమైన హిందూస్థానీ, కర్ణాటక సంగీత గ్రంథాలను తులనాత్మకంగా పరిశీలించి ఒక చిన్న, గొప్ప గ్రంథం రచించారు.
ఇప్పటి వరకు తెలుగులో వెలువడినవన్నీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రచించిన సంగీత పాఠ్యగ్రంథాలే. తెలుగులో సంగీతానికి సంబంధించి మౌలిక పరిశోధనలు జరిపి కొత్త విషయాలను తెలిపిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు మాత్రమే. కాని, ఆయన చెప్పని వివాదాస్పద అంశాలు కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని చెప్పడానికే నేనీ రచనకు పూనుకున్నాను. నేనీ పుస్తకంలో చెప్పిన కొన్ని విషయాలు ఇంగ్లీషులో కూడా ఎవరూ చెప్పినట్లు నా దృష్టికి రాలేదు.
భారతీయ సంగీత శాస్త్ర చరిత్ర గురించి నేనొక పుస్తకం రాస్తాననీ, రాయాల్సి వస్తుందనీ పదేళ్ళ క్రిందటి వరకూ ఎన్నడూ అనుకోలేదు. సంగీత సంబంధమైన గ్రంథాలు, వ్యాసాలూ ఇంగ్లీషులో, తెలుగులో, ఇతర భాషలలో ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో కొన్ని హిందూస్థానీ సంగీతం గురించినవి. మరికొన్ని కర్ణాటక సంగీతం గురించినవి. ఈ రెండూ ఒకే గొప్ప సంగీత వ్యవస్థకు చెందిన శాఖలు. వాటి మధ్య గాయన శైలీ భేదం తప్ప ఇతరాత్ర పెద్దగా తేడాలు లేవు. ఉన్న కొద్ది తేడాలు కూడా 14వ శతాబ్దంలో పొరపాటుగానో, ఉద్దేశపూర్వకంగా సంగీత వ్యాకరణంలోకి కృత్రిమంగా చొప్పించబడినవి. ఈ దృష్టితో మొత్తం భారతీయ సంగీతం గురించి రచించిన గ్రంథాలు కనిపించవు. ఎప్పుడో వందేళ్ళక్రిందట విష్ణునారాయణ్ భాత్ఖండేగారు 15 - 18 శతాబ్దాల మధ్యకాలంలో వెలువడిన కొన్ని ముఖ్యమైన హిందూస్థానీ, కర్ణాటక సంగీత గ్రంథాలను తులనాత్మకంగా పరిశీలించి ఒక చిన్న, గొప్ప గ్రంథం రచించారు. ఇప్పటి వరకు తెలుగులో వెలువడినవన్నీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రచించిన సంగీత పాఠ్యగ్రంథాలే. తెలుగులో సంగీతానికి సంబంధించి మౌలిక పరిశోధనలు జరిపి కొత్త విషయాలను తెలిపిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు మాత్రమే. కాని, ఆయన చెప్పని వివాదాస్పద అంశాలు కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని చెప్పడానికే నేనీ రచనకు పూనుకున్నాను. నేనీ పుస్తకంలో చెప్పిన కొన్ని విషయాలు ఇంగ్లీషులో కూడా ఎవరూ చెప్పినట్లు నా దృష్టికి రాలేదు.© 2017,www.logili.com All Rights Reserved.