స్ఫూర్తిమంతమైన జీవితాల కోసం ఎక్కడెక్కడో వెదుకుతాం. అలాంటి వ్యక్తుల్ని అనుసరించాలని ఉబలాటపడతాం. కానీ ఒక్కసారి చుట్టూ చుస్తే అలాంటి జీవితాలు అత్యున్నతమైన వ్యక్తులు మన పక్కనే ఉన్నారని తెలుసుకొని విస్తుపోతాం.
డాక్టర్ కంకణాల కృష్ణమోహన్ గారు మా గ్రామస్తుడే. నాకు బాల్యమిత్రుడే. కలిసి చదువుకున్నాం. పెద్దయ్యాక దారులు వేరయ్యాయి. అయన మెడిసిన్ చేశారు. నేను ఆర్ట్స్ వైపు వచ్చాను. ఎవరి మార్గంలో వాళ్ళం పయనించం. మధ్యలో మేము తారసపడే అవకాశం లభించలేదు. ఇప్పుడు విశ్రాంతి జీవితంలో ఒకచోట చేరి గడిపిన జీవితాన్ని కలిసి నెమరేసుకుంటుంటే ఎన్నెన్ని అద్భుతాలు!
పేదలపక్షపాతిగా వైద్యాన్ని సేవారంగంగా గుర్తించి మారుమూల పల్నాడు ప్రాంతంలో వైద్యసేవలందించడం కోసం అక్కడ వైద్యశాల నెలకొల్పడం ఒక విశిష్టత. రోగాన్ని తప్ప రోగి డబ్బును చూడకుండా అవసరమైతే ఉచితంగా వైద్యం చేయడం మరో విశిష్టత. అడవుల్లోకి ప్రయాణించి అక్కడి గూడేల్లోని ప్రజలకు వైద్యం చేయడమే కాకుండా ఆ క్రమంలో పోలీసుకేసుల్ని కూడా దైర్యంగా ఎదుర్కోవడం అబ్బురపరిచే సాహసం. మొత్తంగా మిత్రుడు కృష్ణమోహన్ గడిపిన చైతన్యవంతమైన జీవితం స్ఫూర్తిదాయకమైంది.
- పిన్నమనేని మృత్యుంజయరావు