ఇంక ఈ శిల్పక్షేత్రాలేమిటి? పూజలుపోయినా శిల్ప సౌందర్యం ఉంటే, ఆ విగ్రహాలు మనుష్యులకు కళానందం కలిగిస్తాయని మహిళా సభలో కొందరు కళా విద్యార్థినులు అంటూ ఉంటారు. దేశం అంతా ఇట్లాంటి క్షేత్రాలెన్నో ఉన్నాయట. ఎల్లోరా,అజంతా, నాగార్జునకొండ, హంపి, లేపాక్షి, అనుమకొండ, ఒరంగల్లు, సంచి మొదలైన క్షేత్రాలెన్నో ఉన్నాయట. ప్రసిద్ధికెక్కిన దేవతల గుహల్లో కూడా ఎన్నో ఉత్కృష్టమైన శిల్పాలు ఉన్నాయట. శిల్పక్షేత్రాలలో ఈ మహాబలిపురం ఒకటి అన్నారు. ఈ విగ్రహాలన్నీ అదో అందం కలిగి ఉన్నట్టు ఆమెకు తోచింది. శిల్పం అన్నా, చిత్రలేఖనం అన్నా తన ఉద్దేశాలు ఇదివరకు వేరు. దేశం అంతా గాంధీ విగ్రహాలు వెలిశాయి. అవే శిల్పాలనుకోంది. మద్రాసులో కొందరి తోటల్లో సిమెంటు చేసిన సింహం, కుస్తీపట్టేవాడు, బంట్రోతు మొదలైన విగ్రహాలే నిజమైన శిల్పం అనుకొన్నది పద్మావతి. చిత్రలేఖనాలు అంటే బజారులో దొరికే అచ్చుబొమ్మలనే ఆమె ఉద్దేశం.
బాపిరాజు నవలల్లో హిమబిందు, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి చారిత్రాత్మక నవలలు. నారాయణరావు, తుపాను, కోణంగి, నరుడు, జాజిమల్లి సాంఘీక నవలలు. వీటిలో 'నారాయణరావు' నవల విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు'తో పోటీపడి ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బహుమతిని గెలుచుకుంది. కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, యుద్ధం, ఆయుధాల వివరాలు, ప్రేమ, ప్రణయం ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వ్యవసాయం, వ్యాపారం, సవివరంగా, కళ్ళెదుట ఉన్నట్లే చిత్రీకరిస్తాడు. నాటకీయమైన సంభాషణలు కథాగమనాన్ని వేగవంతం చేస్తాయి. సందర్భోచితమైన గీతాలను నవలలో కూడా వాడుకోవడం ద్వారా తన సంగీత నృత్య రూపకంగా భాసింపజేస్తాడు. చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడవి బాపిరాజు గొప్ప భావకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకథకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.
ఇంక ఈ శిల్పక్షేత్రాలేమిటి? పూజలుపోయినా శిల్ప సౌందర్యం ఉంటే, ఆ విగ్రహాలు మనుష్యులకు కళానందం కలిగిస్తాయని మహిళా సభలో కొందరు కళా విద్యార్థినులు అంటూ ఉంటారు. దేశం అంతా ఇట్లాంటి క్షేత్రాలెన్నో ఉన్నాయట. ఎల్లోరా,అజంతా, నాగార్జునకొండ, హంపి, లేపాక్షి, అనుమకొండ, ఒరంగల్లు, సంచి మొదలైన క్షేత్రాలెన్నో ఉన్నాయట. ప్రసిద్ధికెక్కిన దేవతల గుహల్లో కూడా ఎన్నో ఉత్కృష్టమైన శిల్పాలు ఉన్నాయట. శిల్పక్షేత్రాలలో ఈ మహాబలిపురం ఒకటి అన్నారు. ఈ విగ్రహాలన్నీ అదో అందం కలిగి ఉన్నట్టు ఆమెకు తోచింది. శిల్పం అన్నా, చిత్రలేఖనం అన్నా తన ఉద్దేశాలు ఇదివరకు వేరు. దేశం అంతా గాంధీ విగ్రహాలు వెలిశాయి. అవే శిల్పాలనుకోంది. మద్రాసులో కొందరి తోటల్లో సిమెంటు చేసిన సింహం, కుస్తీపట్టేవాడు, బంట్రోతు మొదలైన విగ్రహాలే నిజమైన శిల్పం అనుకొన్నది పద్మావతి. చిత్రలేఖనాలు అంటే బజారులో దొరికే అచ్చుబొమ్మలనే ఆమె ఉద్దేశం. బాపిరాజు నవలల్లో హిమబిందు, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి చారిత్రాత్మక నవలలు. నారాయణరావు, తుపాను, కోణంగి, నరుడు, జాజిమల్లి సాంఘీక నవలలు. వీటిలో 'నారాయణరావు' నవల విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు'తో పోటీపడి ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బహుమతిని గెలుచుకుంది. కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, యుద్ధం, ఆయుధాల వివరాలు, ప్రేమ, ప్రణయం ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వ్యవసాయం, వ్యాపారం, సవివరంగా, కళ్ళెదుట ఉన్నట్లే చిత్రీకరిస్తాడు. నాటకీయమైన సంభాషణలు కథాగమనాన్ని వేగవంతం చేస్తాయి. సందర్భోచితమైన గీతాలను నవలలో కూడా వాడుకోవడం ద్వారా తన సంగీత నృత్య రూపకంగా భాసింపజేస్తాడు. చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడవి బాపిరాజు గొప్ప భావకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకథకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.© 2017,www.logili.com All Rights Reserved.