బాపిరాజు నవలల్లో హిమబిందు, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి చారిత్రాత్మక నవలలు. నారాయణరావు, తుపాను, కోణంగి, నరుడు, జాజిమల్లి సాంఘీక నవలలు. వీటిలో 'నారాయణరావు' నవల విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు'తో పోటీపడి ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బహుమతిని గెలుచుకుంది. కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, యుద్ధం, ఆయుధాల వివరాలు, ప్రేమ, ప్రణయం ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వ్యవసాయం, వ్యాపారం, సవివరంగా, కళ్ళెదుట ఉన్నట్లే చిత్రీకరిస్తాడు. నాటకీయమైన సంభాషణలు కథాగమనాన్ని వేగవంతం చేస్తాయి. సందర్భోచితమైన గీతాలను నవలలో కూడా వాడుకోవడం ద్వారా తన సంగీత నృత్య రూపకంగా భాసింపజేస్తాడు. చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడవి బాపిరాజు గొప్ప భావకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకథకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.

© 2017,www.logili.com All Rights Reserved.