కారణాలు తెలియవుగానీ 'చందమామ' లో 'దాసు' గారి 'రాకాసిలోయ' సీరియల్ తర్వాత 1964 నుంచి రెండేళ్ళపాటు బెంగాలీ సీరియల్స్ - 'దుర్గేశనందిని', 'నవాబునందిని' - ప్రచురించారు. అందుకు 'దాసు' గారు కొంత మనస్తాపం చెంది ఉండవచ్చు. అది సహజం కదా! అలాంటి సంస్థానాల కథలు మనం కొత్తగా రాయలేమా అన్న పట్టుదలతో ఆ తర్వాతి కాలంలో 'దాసు' గారు రాజపుత్ర సంస్థానాల నేపథ్యంలో 'అగ్నిమాల' రాసి ఉంటారు. అయినా అందులో ఆయనకే ప్రత్యేకమైన జానపద చమక్కుల, తళుకుల సొబగులతో పాటు స్త్రీ పాత్రల ప్రాధాన్యత కూడా 'అగ్నిమాల' లో మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.
'అగ్నిమాల' నవల 'కథానిలయం' లో అక్కడ ఉన్న కొద్దిపాటి 'యువ' దీపావళి సంచికల్లో దొరుకుతుందేమో వెదికి పెట్టమని మిత్రుడు దాసరి రామచంద్రరావును కోరడం జరిగింది. ఏ దీపావళి సంచికలోనూ 'అగ్నిమాల' దొరకలేదన్నది వచ్చిన సమాచారం.
- శాయి
కారణాలు తెలియవుగానీ 'చందమామ' లో 'దాసు' గారి 'రాకాసిలోయ' సీరియల్ తర్వాత 1964 నుంచి రెండేళ్ళపాటు బెంగాలీ సీరియల్స్ - 'దుర్గేశనందిని', 'నవాబునందిని' - ప్రచురించారు. అందుకు 'దాసు' గారు కొంత మనస్తాపం చెంది ఉండవచ్చు. అది సహజం కదా! అలాంటి సంస్థానాల కథలు మనం కొత్తగా రాయలేమా అన్న పట్టుదలతో ఆ తర్వాతి కాలంలో 'దాసు' గారు రాజపుత్ర సంస్థానాల నేపథ్యంలో 'అగ్నిమాల' రాసి ఉంటారు. అయినా అందులో ఆయనకే ప్రత్యేకమైన జానపద చమక్కుల, తళుకుల సొబగులతో పాటు స్త్రీ పాత్రల ప్రాధాన్యత కూడా 'అగ్నిమాల' లో మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. 'అగ్నిమాల' నవల 'కథానిలయం' లో అక్కడ ఉన్న కొద్దిపాటి 'యువ' దీపావళి సంచికల్లో దొరుకుతుందేమో వెదికి పెట్టమని మిత్రుడు దాసరి రామచంద్రరావును కోరడం జరిగింది. ఏ దీపావళి సంచికలోనూ 'అగ్నిమాల' దొరకలేదన్నది వచ్చిన సమాచారం. - శాయి© 2017,www.logili.com All Rights Reserved.