కావేరీ నదిని అనేకకానేక చోట్ల అనేకానేక దశల్లో చూశాను. కూర్గు కొండలు దాటి కుశాల నగర్ దగ్గర మైదానల్లోకి ప్రవేశించడం చూశాను. మైసూరు దగ్గర కృష్ణరాజ సాగర మవడం చూశాను. శ్రీ రంగ పట్టణం చెరువలోని రంగనతిట్టు దగ్గర పక్షుల స్వర్గధామానికి ఆయువుపట్టు అవడం చూశాను. మరికాస్త దూరంలో హోగెనికల్ దగ్గర బండరాళ్లలో పొగలు సృష్టించడం చూశాను. శివ సముద్రం దగ్గర శ్రీ శ్రీ కి కూడా ఉత్సాహం కలిగించడం చూశాను. శ్రీ రంగం దగ్గర రంగ నాధుని గుడికి ద్విపాన్ని ఇవ్వడం చూశాను. ఆ దిగువన కరికాల చోళుని ఆనకట్టకూ, త్యాగరాజు కీర్తనలకూ మూలా ధారమవడం చూశాను. అన్ని దశలలో చుసిన కావేరిని సాగర సంగమ దశలోనూ చూడాలన్నది నాకు ఎప్పట్నుంచో ఉన్న బలమైన కోరిక.
- దాసరి అమరేంద్ర