మోదీ ప్రధాని కావడం కాదు కానీ, లోకమంతా తలకిందులు చేసేద్దామన్న ఉబలాటం పుట్టింది కొందరికి. కరెన్సీ నోట్ల నుంచి గాంధీ బొమ్మ తీసేయాలని, విశ్వవిద్యాలయాలలో స్కూళ్లలో గాంధీని జాతిపితగా వ్యవహరించడం మానేయాలనీ ఆందోళన చేస్తున్నారు. గాంధీని చంపిన నథూరామ్ గోడ్సేకు విగ్రహాలు పెట్టడమే కాదు, గుళ్లు కట్టాలని కూడా అంటున్నారు. 2014 డిసెంబరులో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ 'గాంధీ ఎంత దేశభక్తుడో గోడ్సే కూడా అంతే దేశభక్తుడు' అని ప్రకటించాడు. దానిపై కాంగ్రెసు ఎంపీలు నిరసన తెలిపారు.
గోడ్సే (ఇంగ్లీషు స్పెల్లింగు చూసి, తెలుగువాళ్లు గాడ్సే అని రాస్తారు కానీ మరాఠీ ఉచ్చారణ ప్రకారం అతని పేరు గోడ్సేయే!) గురించి ఒక్క మంచి మాట పలికినా యిన్నాళ్లూ మీడియా గగ్గోలు పెడుతూ వచ్చింది. బిహార్ అసెంబ్లీలో అనుకుంటా దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూంటే కాంగ్రెసు శాసనసభ్యులు అతన్ని మాట్లాడ నీయకుండా చేయడానికి 'గాంధీకీ జై' అని నినాదాలు చేయసాగారు. అప్పట్లో యిది కొత్త టెక్నిక్కు తర్వాతి రోజుల్లో బిజెపి తరపున స్వామీజీలు, సాధ్వీమణులు పార్లమెంటులో ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెసు వాళ్లు ఏం మాట్లాడినా 'జై శ్రీరామ్'
అంటూ అరుస్తూండేవారు. ఇటీవలి కాలంలో 'జై తెలంగాణ' నినాదాలూ యిలాగే పుపయోగపడ్డాయి.
ఇంతకీ ఆ రోజున బిహార్ ఎమ్మెల్యే కాంగ్రెసు వాళ్లను ఆపడానికి ప్రయత్నించి విఫలమై చివరకు కసిగా 'గోడ్సేకీ జై' అన్నాడు. - వాళ్ల గాంధీకి యాంటీ డోట్ గోడ్సే అనే అర్థంలో! అంతకంటె గోడ్సే గొప్పవాడనీ అనలేదు, మరోటీ అనలేదు. అంతే అప్పట్నుంచి మీడియా అతన్ని పట్టించింది. - ది లీడర్ హూ సెడ్ గోడ్సేకీ జై అని తెగ నడిచింది. గోడ్సే పేరెత్తితేనే అంత.................
గోడ్సే దేశభక్తి మోదీ ప్రధాని కావడం కాదు కానీ, లోకమంతా తలకిందులు చేసేద్దామన్న ఉబలాటం పుట్టింది కొందరికి. కరెన్సీ నోట్ల నుంచి గాంధీ బొమ్మ తీసేయాలని, విశ్వవిద్యాలయాలలో స్కూళ్లలో గాంధీని జాతిపితగా వ్యవహరించడం మానేయాలనీ ఆందోళన చేస్తున్నారు. గాంధీని చంపిన నథూరామ్ గోడ్సేకు విగ్రహాలు పెట్టడమే కాదు, గుళ్లు కట్టాలని కూడా అంటున్నారు. 2014 డిసెంబరులో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ 'గాంధీ ఎంత దేశభక్తుడో గోడ్సే కూడా అంతే దేశభక్తుడు' అని ప్రకటించాడు. దానిపై కాంగ్రెసు ఎంపీలు నిరసన తెలిపారు. గోడ్సే (ఇంగ్లీషు స్పెల్లింగు చూసి, తెలుగువాళ్లు గాడ్సే అని రాస్తారు కానీ మరాఠీ ఉచ్చారణ ప్రకారం అతని పేరు గోడ్సేయే!) గురించి ఒక్క మంచి మాట పలికినా యిన్నాళ్లూ మీడియా గగ్గోలు పెడుతూ వచ్చింది. బిహార్ అసెంబ్లీలో అనుకుంటా దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూంటే కాంగ్రెసు శాసనసభ్యులు అతన్ని మాట్లాడ నీయకుండా చేయడానికి 'గాంధీకీ జై' అని నినాదాలు చేయసాగారు. అప్పట్లో యిది కొత్త టెక్నిక్కు తర్వాతి రోజుల్లో బిజెపి తరపున స్వామీజీలు, సాధ్వీమణులు పార్లమెంటులో ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెసు వాళ్లు ఏం మాట్లాడినా 'జై శ్రీరామ్' అంటూ అరుస్తూండేవారు. ఇటీవలి కాలంలో 'జై తెలంగాణ' నినాదాలూ యిలాగే పుపయోగపడ్డాయి. ఇంతకీ ఆ రోజున బిహార్ ఎమ్మెల్యే కాంగ్రెసు వాళ్లను ఆపడానికి ప్రయత్నించి విఫలమై చివరకు కసిగా 'గోడ్సేకీ జై' అన్నాడు. - వాళ్ల గాంధీకి యాంటీ డోట్ గోడ్సే అనే అర్థంలో! అంతకంటె గోడ్సే గొప్పవాడనీ అనలేదు, మరోటీ అనలేదు. అంతే అప్పట్నుంచి మీడియా అతన్ని పట్టించింది. - ది లీడర్ హూ సెడ్ గోడ్సేకీ జై అని తెగ నడిచింది. గోడ్సే పేరెత్తితేనే అంత.................© 2017,www.logili.com All Rights Reserved.