ప్రోలాగ్
1936, పోక్రా గ్రామం, నేపాల్
ఒక వైపు వెండి కొండల్లా మెరిసే హిమాలయాలు. మరో వైపు ఫె సరస్సు, ఇంకో వైపు పోక్రా లోయ. పచ్చటి చేల మధ్య చిన్నచిన్న కొండలపై రాళ్లతో, చెక్కలతో కట్టబడిన ఇళ్లు.
“సాచీ, నీరసంగా ఉన్నావ్, కాస్త విశ్రాంతి తీసుకో” అన్నాడు బిను అనునయంగా అక్క చేతిని పట్టుకుంటూ.
"లేదు బిను, ఇప్పుడు మాట్లాడలేకపోతే ఇక మాట్లాడలేనేమో! దేవిని నీతో పాటు తీసుకెళ్లు. జీవితంలో దుర్భరత్వం ఎలాంటి పనినైనా చేయిస్తుంది. వాళ్ల నాన్న ఆరోగ్యానికి డబ్బులవసరమై దేవిని చిన్న వయస్సులోనే ముసలోడికిచ్చి పెళ్లి చేశాం. దేవికిప్పుడు నేను తప్ప ఎవరూ మిగల్లేదు. నేను పోతే దేవి పరిస్థితేంటనే భయంతోనే బతికున్నానేమో ఇంతకాలం” వడలిపోయిన సాచి ముఖంలో వెలుగు కనిపిస్తుంది.
“అమ్మా, నాన్నా ఇంకా నా మీద కోపంగా ఉన్నారా బిను?”.............
ప్రోలాగ్ 1936, పోక్రా గ్రామం, నేపాల్ ఒక వైపు వెండి కొండల్లా మెరిసే హిమాలయాలు. మరో వైపు ఫె సరస్సు, ఇంకో వైపు పోక్రా లోయ. పచ్చటి చేల మధ్య చిన్నచిన్న కొండలపై రాళ్లతో, చెక్కలతో కట్టబడిన ఇళ్లు. “సాచీ, నీరసంగా ఉన్నావ్, కాస్త విశ్రాంతి తీసుకో” అన్నాడు బిను అనునయంగా అక్క చేతిని పట్టుకుంటూ. "లేదు బిను, ఇప్పుడు మాట్లాడలేకపోతే ఇక మాట్లాడలేనేమో! దేవిని నీతో పాటు తీసుకెళ్లు. జీవితంలో దుర్భరత్వం ఎలాంటి పనినైనా చేయిస్తుంది. వాళ్ల నాన్న ఆరోగ్యానికి డబ్బులవసరమై దేవిని చిన్న వయస్సులోనే ముసలోడికిచ్చి పెళ్లి చేశాం. దేవికిప్పుడు నేను తప్ప ఎవరూ మిగల్లేదు. నేను పోతే దేవి పరిస్థితేంటనే భయంతోనే బతికున్నానేమో ఇంతకాలం” వడలిపోయిన సాచి ముఖంలో వెలుగు కనిపిస్తుంది. “అమ్మా, నాన్నా ఇంకా నా మీద కోపంగా ఉన్నారా బిను?”.............© 2017,www.logili.com All Rights Reserved.