ఏది మోసమో, ఏది న్యాయమో అర్థం కావాలంటే
అనేక జీవితాల్ని, కాలాల్ని ఏకకాలంలో చూడగలగాలి - అసత్యం
మంచితనమని బలహీనమైన మనసున్నవాళ్ళని లోబరుచుకుంటారు.
మంచితనం ఎప్పుడూ అన్యాయమే కదా! - జనరల్ కంపార్ట్మెంట్
జీవితంలో ఉత్తమోత్తమమైన సందర్భం ఏమిటో తెలుసా!
నీ వాళ్ళనుకున్నవాళ్ళు నిన్ను విడిచి వెళ్ళాక
హాయిగా ఊపిరి పీల్చుకోవటం. - ఆమె నవ్వు
పైకి మాట్లాడే మాటలు కళ్లు మాట్లాడలేకపోవడం విషాదం
అది అర్థంకాకపోవడం ఒక సౌలభ్యం . - D/o విజ్జి
ఎక్కువ వేదన, దుఃఖం మిగిల్చే కోరికలని ఆపడానికి
లోకం నైతికమనే మాటని తీసుకువచ్చిందనిపిస్తుంది - డైలాగ్ విత్ శశి
© 2017,www.logili.com All Rights Reserved.