పితృస్వామ్య దృక్పధం పై యుద్ధం ఈ అర్ధనారి
జి. లక్ష్మీనరసయ్య
బండి నారాయణస్వామి రాసిన ఐదో నవల అర్ధనారి. గత నాలుగు నవలల్లో నాలుగు విభిన్న ఇతివృత్తాలను డీల్ చేశాడు. గద్దలాడతండాయి నవలలో దళిత బహుజన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పునాది దృష్టి నుంచి చూపాడు. మీరాజ్యం మీరేలండి దళిత బహుజన రాజకీయ చూపుతో వచ్చిన నవల. రెండు కలల దేశం పీడితకుల ప్రజల తాత్వికతను వెల్లడించింది. శృభూమి 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రలోని దళిత బహుజన ఘట్టాల్ని ముందుకు తెచ్చింది. ప్రస్తుతం మన ముందున్న అర్ధనారిలో ట్రాన్స్ జెండర్ వాస్తవికత గురించి బహుముఖ చిత్రణ ఉంది. తెలుగు నవలలో ఈ వస్తువును ఇంత వివరంగా లోతుగా డీల్ చేయడం ఇంతకుముందు జరగ లేదు. ఈ వస్తువుకు సమాంతరంగా పడుపువృత్తిని గురించిన మరో కథనం కూడా ఇందులో నడిచింది. రెండు సమస్యల వెనకా ఉన్న పితృస్వామిక సమాజాన్ని విస్తార విశ్లేషణకు గురిచేయడం ఉంది. ట్రాన్స్ జెండర్ ప్రపంచాన్ని రమణి ఉరఫ్ చంద్రన్న జీవితం ద్వారా నిర్మించుతూ పడుపు వృత్తి వాస్తవికతను రామలక్ష్మి పాత్ర ద్వారా చూపాడు. దిగువ మధ్యతరగతి బహుజన వ్యవసాయ కుటుంబానికి చెందిన చంద్రన్న అనే యువకుడు రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి, సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్నీ, హింసనీ, వివక్షనీ, వంచననీ అనుభవించిన తీరు సమంజసంగా చిత్రించాడు రచయిత. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్ వ్యవస్థ నిర్మాణాన్ని అందులోని ఖాదాన్ లనూ, గురువులనూ, నానీలనూ, చేలాలను వారి జీవన విధానాన్ని రోజువారీ............
పితృస్వామ్య దృక్పధం పై యుద్ధం ఈ అర్ధనారి జి. లక్ష్మీనరసయ్య బండి నారాయణస్వామి రాసిన ఐదో నవల అర్ధనారి. గత నాలుగు నవలల్లో నాలుగు విభిన్న ఇతివృత్తాలను డీల్ చేశాడు. గద్దలాడతండాయి నవలలో దళిత బహుజన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పునాది దృష్టి నుంచి చూపాడు. మీరాజ్యం మీరేలండి దళిత బహుజన రాజకీయ చూపుతో వచ్చిన నవల. రెండు కలల దేశం పీడితకుల ప్రజల తాత్వికతను వెల్లడించింది. శృభూమి 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రలోని దళిత బహుజన ఘట్టాల్ని ముందుకు తెచ్చింది. ప్రస్తుతం మన ముందున్న అర్ధనారిలో ట్రాన్స్ జెండర్ వాస్తవికత గురించి బహుముఖ చిత్రణ ఉంది. తెలుగు నవలలో ఈ వస్తువును ఇంత వివరంగా లోతుగా డీల్ చేయడం ఇంతకుముందు జరగ లేదు. ఈ వస్తువుకు సమాంతరంగా పడుపువృత్తిని గురించిన మరో కథనం కూడా ఇందులో నడిచింది. రెండు సమస్యల వెనకా ఉన్న పితృస్వామిక సమాజాన్ని విస్తార విశ్లేషణకు గురిచేయడం ఉంది. ట్రాన్స్ జెండర్ ప్రపంచాన్ని రమణి ఉరఫ్ చంద్రన్న జీవితం ద్వారా నిర్మించుతూ పడుపు వృత్తి వాస్తవికతను రామలక్ష్మి పాత్ర ద్వారా చూపాడు. దిగువ మధ్యతరగతి బహుజన వ్యవసాయ కుటుంబానికి చెందిన చంద్రన్న అనే యువకుడు రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి, సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్నీ, హింసనీ, వివక్షనీ, వంచననీ అనుభవించిన తీరు సమంజసంగా చిత్రించాడు రచయిత. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్ వ్యవస్థ నిర్మాణాన్ని అందులోని ఖాదాన్ లనూ, గురువులనూ, నానీలనూ, చేలాలను వారి జీవన విధానాన్ని రోజువారీ............© 2017,www.logili.com All Rights Reserved.