నా కిటికీ లోంచి ఆకాశం.....
నా సర్టిఫికేట్లు చూసిన హెచ్.ఆర్ చాలా ఆశ్చర్యపోతూ " ఈ ఉద్యోగానికి ఎందుకొచ్చినట్లు? యూ ఆర్ ఏ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్" అన్నాడు.
"నాకు పదకొండు వేల తొంబై ఆరు రూపాయలు అవసరం" తడుముకోకుండా చెప్పాను.
వాళ్ళు ఆశ్చర్యంతో ఒకరి మొహలోకరు చూసుకున్నారు. ఒక పెద్దాయన కాగితం, పెన్ను నా ముందుకు తోసి " వెల్! ఆ జీతం అంత ఖచ్చితంగా చెప్పావు కాబట్టి నీ ప్రయారిటిస్ కూడా ఖచ్చితంగా రాసి చూపించు" అన్నాడు.
నాకు నవ్వొచింది. మొదటిసారి నేను ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు, ఇలాగే రాయమన్నప్పుడు విరజకోసం ఓ ఫ్లాటు, ఆమెని తిప్పడానికి ఓ చిన్నకారు, మా హనీమూన్ కి డార్జిలింగ్ వెళ్ళడానికి ఎయిర్ టికెట్స్ లాంటివి ఆలోచిస్తూ రాశాను.
నాకీసారి ఆ బెంగలేదు. వరుసగా రాశాను. ఇంటద్దె, వాచ్ మెన్ తాతకి దగ్గుమందు, అంజమ్మ కొడుకు ఫీజు, నా సరుకులు నామాలకి హెలికాప్టర్ బొమ్మ, రామారావు గారికి కరెంట్ తో నడిచే కుట్టుమిషన్, అయన మనవరాలి పేరుమీద ప్రతినెలా కొంత డబ్బు, రెండొందల యాబై రూపాయలు.. నా పావురాల కోసం!
ఈ ఉద్యోగం నాకే వచ్చింది. ఇది ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, ఈ కంపెనీలన్నీ రామానుజం గారివి... మా నాన్నకి దగ్గర మిత్రుడాయన! వారి అమ్మాయి మాధవిని చేసుకుని, దీనికి ఓనర్ ని అయినా ఇంత ఆనందం, తృప్తీ దొరికేవి కావేమో!
రెండో సంపుటి గా వెలువడుతున్న 32 కధల సమాహారం.
బలభద్రపాత్రుని రమణి గారు కొత్త తరం ప్రముఖ రచయిత్రి మరియు చలనచిత్ర రచయిత్రి. రమణి గారు దాదాపు 20 పైన నవలలు రాశారు. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.
రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.
నా కిటికీ లోంచి ఆకాశం..... నా సర్టిఫికేట్లు చూసిన హెచ్.ఆర్ చాలా ఆశ్చర్యపోతూ " ఈ ఉద్యోగానికి ఎందుకొచ్చినట్లు? యూ ఆర్ ఏ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్" అన్నాడు. "నాకు పదకొండు వేల తొంబై ఆరు రూపాయలు అవసరం" తడుముకోకుండా చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యంతో ఒకరి మొహలోకరు చూసుకున్నారు. ఒక పెద్దాయన కాగితం, పెన్ను నా ముందుకు తోసి " వెల్! ఆ జీతం అంత ఖచ్చితంగా చెప్పావు కాబట్టి నీ ప్రయారిటిస్ కూడా ఖచ్చితంగా రాసి చూపించు" అన్నాడు. నాకు నవ్వొచింది. మొదటిసారి నేను ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు, ఇలాగే రాయమన్నప్పుడు విరజకోసం ఓ ఫ్లాటు, ఆమెని తిప్పడానికి ఓ చిన్నకారు, మా హనీమూన్ కి డార్జిలింగ్ వెళ్ళడానికి ఎయిర్ టికెట్స్ లాంటివి ఆలోచిస్తూ రాశాను. నాకీసారి ఆ బెంగలేదు. వరుసగా రాశాను. ఇంటద్దె, వాచ్ మెన్ తాతకి దగ్గుమందు, అంజమ్మ కొడుకు ఫీజు, నా సరుకులు నామాలకి హెలికాప్టర్ బొమ్మ, రామారావు గారికి కరెంట్ తో నడిచే కుట్టుమిషన్, అయన మనవరాలి పేరుమీద ప్రతినెలా కొంత డబ్బు, రెండొందల యాబై రూపాయలు.. నా పావురాల కోసం! ఈ ఉద్యోగం నాకే వచ్చింది. ఇది ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, ఈ కంపెనీలన్నీ రామానుజం గారివి... మా నాన్నకి దగ్గర మిత్రుడాయన! వారి అమ్మాయి మాధవిని చేసుకుని, దీనికి ఓనర్ ని అయినా ఇంత ఆనందం, తృప్తీ దొరికేవి కావేమో! రెండో సంపుటి గా వెలువడుతున్న 32 కధల సమాహారం. బలభద్రపాత్రుని రమణి గారు కొత్త తరం ప్రముఖ రచయిత్రి మరియు చలనచిత్ర రచయిత్రి. రమణి గారు దాదాపు 20 పైన నవలలు రాశారు. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి. రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.© 2017,www.logili.com All Rights Reserved.