కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్లకోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్దాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపొతే అవి ఉత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించాగలం.
ఇప్పుడు వచ్చే కథలకి ఆ గుణం లేదు. ఎందుకంటే మనుషులకి ఈ భూమిని మించిన దృష్టి లేదు గనుక. చదివే వాళ్ళు మాత్రం విశాలమైన కథల్నే కోరుతారు. కాని రచయితకి హ్రస్వదృష్టి ఏర్పడి గొప్పకథలు రాయగలిగిన విశాల హృదయం నశిస్తోంది. మానవుడు అనేటప్పటికి, ఆకలీ, డబ్బే కనబడుతున్నాయి. వాటిల్లోంచి గొప్ప రచనని సాగించడమంటే అది వాళ్లకి చాతకాని పని అయింది. ఎందుకు? అసలు జీవితానికి అర్థం కనపడతము లేదు. నిజమైన అర్థమో, అబద్ధమైన అర్థమో, అందుకని తినడమో, బతకడమో ఏ అందము లేకుండా కనడమో ఇంతే కనపడుతోంది. డబ్బుతో 'జిగిల్' చేసి లక్షలు సంపాయించే వాళ్ళని హీరోకింద చూపే ధైర్యం లేదు. ఒక బ్లాక్ మార్కెట్ హీరోని, సినిమా డైరెక్టరుని గొప్పగా చిత్రించే కథలు కల్పించే రచయిత లేడు. అవన్నీ గిట్టని పనులు. కనక ఆకలిలోంచి, డబ్బులోంచి పొయిట్రీ తెప్పించలేము.
- చలం
కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్లకోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్దాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపొతే అవి ఉత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించాగలం. ఇప్పుడు వచ్చే కథలకి ఆ గుణం లేదు. ఎందుకంటే మనుషులకి ఈ భూమిని మించిన దృష్టి లేదు గనుక. చదివే వాళ్ళు మాత్రం విశాలమైన కథల్నే కోరుతారు. కాని రచయితకి హ్రస్వదృష్టి ఏర్పడి గొప్పకథలు రాయగలిగిన విశాల హృదయం నశిస్తోంది. మానవుడు అనేటప్పటికి, ఆకలీ, డబ్బే కనబడుతున్నాయి. వాటిల్లోంచి గొప్ప రచనని సాగించడమంటే అది వాళ్లకి చాతకాని పని అయింది. ఎందుకు? అసలు జీవితానికి అర్థం కనపడతము లేదు. నిజమైన అర్థమో, అబద్ధమైన అర్థమో, అందుకని తినడమో, బతకడమో ఏ అందము లేకుండా కనడమో ఇంతే కనపడుతోంది. డబ్బుతో 'జిగిల్' చేసి లక్షలు సంపాయించే వాళ్ళని హీరోకింద చూపే ధైర్యం లేదు. ఒక బ్లాక్ మార్కెట్ హీరోని, సినిమా డైరెక్టరుని గొప్పగా చిత్రించే కథలు కల్పించే రచయిత లేడు. అవన్నీ గిట్టని పనులు. కనక ఆకలిలోంచి, డబ్బులోంచి పొయిట్రీ తెప్పించలేము. - చలం© 2017,www.logili.com All Rights Reserved.