ఇటువంటి ఒక అవకాశం దొరికినప్పుడు మరెవరైనా సరే ఇంత పెద్ద ప్రయాణం చేయగలరో లేరో కానీ నెను చేశాను. అది కాలాన్ని దూరాన్ని ఓడించిన ప్రయాణం. వందేళ్లకాలం వెనక్కి వెళ్లాను. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల మధ్య విస్తరించిన భారతదేశమంతటా తిరిగాను అక్షరావతాల మీద.
పంజాబు సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ.. అంటూ పదమూడు బాషల నవలా సాహిత్యాలు చదువుకుంటూ దాదాపు ఏడేళ్లపాటు నేను చేసిన చిర దీక్ష తపస్సు ఇది. అదంతా ఈ పుస్తకంలో ఉంది. ఒక ఉపేంద్రకిషోర్ దాస్ ఒక కాళిందీ చరణ్ పాణిగ్రాహి అటు అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి నుంచి ఇటు గుజరాతీ రచయిత్రి కుందనికా కపాడియా దాక ఇందులో ఉన్నారు. ఇటు తక్కాళి శివరామకరంతల నుంచి బిభూతి భూషణ్ మీదుగా ఎస్. ఎల్. బైరప్ప వరకు చేసిన నవలా ప్రపంచదర్శనం ఇందులో ఉంది. ఆంగ్లాంధ్ర రచయితల నవలా సారాంశాలు నివేదించడంలో నేను ఎమరుపాటుకు లోను కాలేదు.
వంద సంవత్సరాలపాటు భారతీయభాషల రచయితలు చూపించిన సమగ్ర భారతీయ సంస్కృతిని ఈ అరవై నవలల పరిచయాల ద్వారా మీకందించే ముందు దానినంతటినీ నేను సమగ్రంగా ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు దాన్ని అంతటిని ఇలా పదిలంగా మీ చేతుల్లో పెడుతున్నాను. అలంటి అరుదైన అవకాశాన్నిచ్చిన సాహిత్య పత్రిక చినుకు చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి