అసుర సంధ్యవేళ. ఆకాశం అద్దంలా మెరుస్తోంది. పశ్చిమాద్రిమీద మూట ముల్లె సర్దుకొని అస్తమించటానికి ఆయత్తమవుతున్నాడు సూరీడు. సంధ్య వెలుగులు అడవిపైన ఉన్నా ఆ అడవిలోన మాత్రం అప్పటికే చీకట్లు ముసురుకొబోతున్నాయి. అంతటి చక్కని కారడవి అది. భైరవకోనలోని ఆ కీకారణ్య మధ్యంలో వాగువెంట ఎగువకు నడిచి పోతున్నారు కొందరు ఆటవికులు.
ప్రయాణం అలసట తెలీకుండా వాళ్ళు పాడుకొంటున్న పాటను చెట్టు పుట్టలు శ్రద్ధగా పులకిస్తున్నాయి. ఒకడు పాడుతున్నాడు, మిగిలినవాళ్ళు వంతపాడుతున్నారు. లయబద్ధమైన ఆ పాట వినసొంపుగా ఉంది. మొత్తం పది ప్లస్ ఒకటి పదకొండుమంది వాళ్ళు. విశేషం ఏమంటే, పదిమందీ యువకులే. బలంగా, దృడంగా, బలిష్టంగా ఉన్నారు. కావి పంచెలు బిగ్గట్టి చేతులకు, మెడలోనూ ఏవో పూసలు, చెట్ల వేళ్ళను దండలుగా ధరించారు. ఒక చేతిలో పొడవు కత్తి, రెండో చేతిలో బరిసె ఆయుధాలుగా ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
అసుర సంధ్యవేళ. ఆకాశం అద్దంలా మెరుస్తోంది. పశ్చిమాద్రిమీద మూట ముల్లె సర్దుకొని అస్తమించటానికి ఆయత్తమవుతున్నాడు సూరీడు. సంధ్య వెలుగులు అడవిపైన ఉన్నా ఆ అడవిలోన మాత్రం అప్పటికే చీకట్లు ముసురుకొబోతున్నాయి. అంతటి చక్కని కారడవి అది. భైరవకోనలోని ఆ కీకారణ్య మధ్యంలో వాగువెంట ఎగువకు నడిచి పోతున్నారు కొందరు ఆటవికులు. ప్రయాణం అలసట తెలీకుండా వాళ్ళు పాడుకొంటున్న పాటను చెట్టు పుట్టలు శ్రద్ధగా పులకిస్తున్నాయి. ఒకడు పాడుతున్నాడు, మిగిలినవాళ్ళు వంతపాడుతున్నారు. లయబద్ధమైన ఆ పాట వినసొంపుగా ఉంది. మొత్తం పది ప్లస్ ఒకటి పదకొండుమంది వాళ్ళు. విశేషం ఏమంటే, పదిమందీ యువకులే. బలంగా, దృడంగా, బలిష్టంగా ఉన్నారు. కావి పంచెలు బిగ్గట్టి చేతులకు, మెడలోనూ ఏవో పూసలు, చెట్ల వేళ్ళను దండలుగా ధరించారు. ఒక చేతిలో పొడవు కత్తి, రెండో చేతిలో బరిసె ఆయుధాలుగా ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.