అమెరికా సాహిత్యకారులలో మార్క్ ట్వేన్ ప్రముఖుడు. ఇతడి అసలు పేరు సామ్యూల్ లాంగ్ హార్న్ క్లెమెన్స్. 1863 నుంచి మార్క్ ట్వేన్ అన్న కలం పేరుతో ఎన్నో రచనలు చేశాడు. అతని రచనల్లో టామ్ సాయర్ సాహసాలు ఎన్నో భాషలలోకి అనువాదం అయ్యింది. టామ్ సాయర్ బృందంలోని వాడే హకల్ బెరీ ఫిన్. దానికి కొనసాగింపుగానే 'హకల్ బెరీ ఫిన్ సాహసాలు' రాశాడు మార్క్ ట్వేన్. ఈ నవల 1885 లో ప్రచురితమయ్యింది. కథాకాలం అప్పటికి 40 - 50 సంవత్సరాల క్రితం నాటి అమెరికా. అంటే ఇది దాదాపు 175 ఏళ్ల నాటి కథ! ఆనాటికి అమెరికాలో బానిసలు ఉండడం చట్టరీత్యా సమ్మతమే. మార్క్ ట్వేన్ జిమ్ పాత్రకి ఉపయోగించిన భాషతో మొదలుకొని అనేక అంశాల దృష్ట్యా ఈ పుస్తకం పై చర్చ జరుగుతూనే ఉంది.
అమెరికా సాహిత్యకారులలో మార్క్ ట్వేన్ ప్రముఖుడు. ఇతడి అసలు పేరు సామ్యూల్ లాంగ్ హార్న్ క్లెమెన్స్. 1863 నుంచి మార్క్ ట్వేన్ అన్న కలం పేరుతో ఎన్నో రచనలు చేశాడు. అతని రచనల్లో టామ్ సాయర్ సాహసాలు ఎన్నో భాషలలోకి అనువాదం అయ్యింది. టామ్ సాయర్ బృందంలోని వాడే హకల్ బెరీ ఫిన్. దానికి కొనసాగింపుగానే 'హకల్ బెరీ ఫిన్ సాహసాలు' రాశాడు మార్క్ ట్వేన్. ఈ నవల 1885 లో ప్రచురితమయ్యింది. కథాకాలం అప్పటికి 40 - 50 సంవత్సరాల క్రితం నాటి అమెరికా. అంటే ఇది దాదాపు 175 ఏళ్ల నాటి కథ! ఆనాటికి అమెరికాలో బానిసలు ఉండడం చట్టరీత్యా సమ్మతమే. మార్క్ ట్వేన్ జిమ్ పాత్రకి ఉపయోగించిన భాషతో మొదలుకొని అనేక అంశాల దృష్ట్యా ఈ పుస్తకం పై చర్చ జరుగుతూనే ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.