చాల్స్ డికెన్స్ నవలలలో బిల్డింగ్ స్రోమన్ శైలివే అధికం . డేవిడ్ కాపర్ ఫీల్డ్ , అశ్లిలత ముచ్చుకైనా కనిపించని ఓ బ్రిటిష్ క్లాసిక్ నవల. పంతొమ్మిదవ శతాబ్దంలో విడుదలైన బ్రిటిష్ నవలలో , ఇది ఉత్తమ రచనగా పరిగణించబడుతోంది. - ప్రస్తుతం BBC రేటింగ్స్ ప్రకారం టాప్ 25 లో ఎనిమిదవ స్థానం పొందింది ఈ నవల. డికెన్స్ వ్రాసిన ఈ ఆణిముత్యం , ప్రపంచ ఆంగ్ల సాహిత్య పాఠ్యపుస్తకాల్లో అగ్రస్థానం అధిరోహించింది.
ఈ పుస్తకంలో కథానాయకుడు డేవిడ్ కాపర్ ఫీల్డ్ , తన జీవిత చరిత్రను ఉయ్యాల నుండి మధ్యవయస్సు వరకు, తనే మనకు చెప్పే శైలిలో ఈ నవల ఉంటుంది.అన్ని కాలాలలోనూ చెల్లుబాటైన ఈ అత్యత్తమ చరిత్రను, ఈ తరం బాలలు ఆదర్శంగా తీసుకుంటే తప్పక విజయం సాధిస్తారు. కాపర్ ఫీల్డ్ తన దారిలో ఎంతోమంది మిత్రులను, శత్రువులను కలుస్తూ తన ప్రయాణాన్ని పరిపక్వత దిశగా కొనసాగిస్తాడు. కొన్ని పాత్రలు అతని జీవితంలోకి ప్రవేశించి ప్రభావం చూపుతూ వెళ్లిపోతుంటాయి, కొన్ని కొనసాగుతుంటాయి.