ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్దుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి. శింగరాయకొండ, ఒంగోలు పల్లె పట్టులు మంచికంటి సాహిత్య, సామాజిక కార్యక్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు విచ్చిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ, తలకు మించిన మడుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం, అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు, బతుకులు బొగ్గాయి కొంపా గూడూ ఒదులుకుని దగ్గరలోని పట్టాణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం - వీటన్నిటికీ మంచికంటి ప్రత్యేక్ష సాక్షి.
తాను విన్న, కన్నా, స్వయంగా అనుభవించిన వాటి ద్వారా ఏర్పరచుకున్న ప్రాపంచిక దృక్పథం నుంచి ఆ కల్లోలాన్ని ఒక సృజనాత్మక రచయితగానే గాక ఒక సామాజిక శాస్త్రవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు, విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోనే చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు, ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకున్నాడు. కథల్లో కంటే అది నవలలో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది. ఈ నవలలో మనుషుల జీవితాల్లోని సంక్లిస్టతనూ మృగ్యమౌతున్న మానవ సంబంధాలనూ కళ్ళకు కట్టినట్లు చూయించాడు మంచికంటి.
- ఎ కె ప్రభాకర్
ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్దుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి. శింగరాయకొండ, ఒంగోలు పల్లె పట్టులు మంచికంటి సాహిత్య, సామాజిక కార్యక్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు విచ్చిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ, తలకు మించిన మడుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం, అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు, బతుకులు బొగ్గాయి కొంపా గూడూ ఒదులుకుని దగ్గరలోని పట్టాణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం - వీటన్నిటికీ మంచికంటి ప్రత్యేక్ష సాక్షి. తాను విన్న, కన్నా, స్వయంగా అనుభవించిన వాటి ద్వారా ఏర్పరచుకున్న ప్రాపంచిక దృక్పథం నుంచి ఆ కల్లోలాన్ని ఒక సృజనాత్మక రచయితగానే గాక ఒక సామాజిక శాస్త్రవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు, విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోనే చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు, ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకున్నాడు. కథల్లో కంటే అది నవలలో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది. ఈ నవలలో మనుషుల జీవితాల్లోని సంక్లిస్టతనూ మృగ్యమౌతున్న మానవ సంబంధాలనూ కళ్ళకు కట్టినట్లు చూయించాడు మంచికంటి. - ఎ కె ప్రభాకర్© 2017,www.logili.com All Rights Reserved.