కవిత్వానికి రోజులు చెల్లిపోయాయా?
నా దేశంలో, నా భాషాపాశ బంధుగణంలో కవిత్వానికి రోజులు చెల్లిపోయాయిలే అని కారుకూతలు కూస్తున్నాయి కొన్ని గొంతుకలు... అవి అక్షరాలని కాగితాల్లో మరమరాలలా పోత పోసి చచ్చుబడిపోతున్న జన జిహ్వల రుచికరమైన చవకబారు ఉప్పు, కారాలు, మసాలాలు ఘాటుగా చల్లి అమ్ముకుంటున్న కృతజ్ఞతాహీనకోకిలలు...
ఎవరు చెప్పారు కవిత్వానికి రోజులు చెల్లాయని? ఎవరు ప్రకటించాడు కవిత్వం చరమాంకదశలో ముక్కి మూలిగి దగ్గుతుందని? ఎవరు? ఎవరలా వాగే ఎడారిలాంటి సమాజంలో ఉనికియే జీవనాధారమని తలచి ఆ ఉనికి దొరక్క దీనంగా తిరిగే నక్కలు...
చదివే వారు లేరని ముద్రించే వారు, ముద్రించేవారు లేరని రాసేవారు, ఇలా అక్షరాలని వ్యాపారానికి, ఉపాధికి చమురులా భావించే
కొందరు వారి వారి స్వయం కారణాల వల్ల కదలకపోతే కవిత్వం చచ్చి పోయినట్టా? ఎవరు తీర్మానించారు ఇది సత్యమని... ?
కవిత్వం కవి మనసును మధిస్తే ఉద్భవించే అమృతం..... అది ఒక అద్భుతం...
కవిత్వాన్ని బ్రతికించే స్థాయి, చంపగల శక్తి ఎవరికీ లేవు.
కవిత్వం అమరం. అజరామరం. దానిని శాసించాలనుకోవడం, 'అది చేతకాక చచ్చిపోయిందని వాగడం నీ మూర్ఖత్వం....
కిటికీలు, తలుపులు, కంటి రెప్పలు మూసుకొని వెలుతురు లేదని...........
కవిత్వానికి రోజులు చెల్లిపోయాయా? నా దేశంలో, నా భాషాపాశ బంధుగణంలో కవిత్వానికి రోజులు చెల్లిపోయాయిలే అని కారుకూతలు కూస్తున్నాయి కొన్ని గొంతుకలు... అవి అక్షరాలని కాగితాల్లో మరమరాలలా పోత పోసి చచ్చుబడిపోతున్న జన జిహ్వల రుచికరమైన చవకబారు ఉప్పు, కారాలు, మసాలాలు ఘాటుగా చల్లి అమ్ముకుంటున్న కృతజ్ఞతాహీనకోకిలలు... ఎవరు చెప్పారు కవిత్వానికి రోజులు చెల్లాయని? ఎవరు ప్రకటించాడు కవిత్వం చరమాంకదశలో ముక్కి మూలిగి దగ్గుతుందని? ఎవరు? ఎవరలా వాగే ఎడారిలాంటి సమాజంలో ఉనికియే జీవనాధారమని తలచి ఆ ఉనికి దొరక్క దీనంగా తిరిగే నక్కలు... చదివే వారు లేరని ముద్రించే వారు, ముద్రించేవారు లేరని రాసేవారు, ఇలా అక్షరాలని వ్యాపారానికి, ఉపాధికి చమురులా భావించే కొందరు వారి వారి స్వయం కారణాల వల్ల కదలకపోతే కవిత్వం చచ్చి పోయినట్టా? ఎవరు తీర్మానించారు ఇది సత్యమని... ? కవిత్వం కవి మనసును మధిస్తే ఉద్భవించే అమృతం..... అది ఒక అద్భుతం... కవిత్వాన్ని బ్రతికించే స్థాయి, చంపగల శక్తి ఎవరికీ లేవు. కవిత్వం అమరం. అజరామరం. దానిని శాసించాలనుకోవడం, 'అది చేతకాక చచ్చిపోయిందని వాగడం నీ మూర్ఖత్వం.... కిటికీలు, తలుపులు, కంటి రెప్పలు మూసుకొని వెలుతురు లేదని...........© 2017,www.logili.com All Rights Reserved.