హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైనది "ఫర్ హూం ది టోల్సు". అదే ఈ "ఘంటారావం". స్పెయిన్ లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగువందల ముప్పైఅయిదు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది. సమకాలీన జీవితాన్ని చిత్రించేటప్పుడు రచయిత పక్షపాతం చూపకూడదని హెమింగ్వే విశ్వసించాడు.
ఒక వంతెన పడగొట్టటంకోసం రాబర్టు జోర్డాన్ అన్న యువ విప్లవవాడి వేసిన పథకాలూ, చేసిన ప్రయత్నాలూ, తర్జన భార్జనలూ, సాటివాళ్ళతో సంఘర్షణలూ, కడపటికి సాధించిన విజయమూ, దాని పర్యవసానాలూ ఈ నవలకి కథావస్తువులు. ఈ నవల హెమింగ్వే రచనా శిల్పానికి చక్కటి నిదర్శనం. మ్రుత్యుచ్చాయలో నాలుగు దినాలపాటు నడిచిన ఉదంతం ఇది. మనిషికి తోటి మానవులతోనూ, సమాజంతోనూ ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని నిరూపించే ఇతివృత్తం ఇది.
హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైనది "ఫర్ హూం ది టోల్సు". అదే ఈ "ఘంటారావం". స్పెయిన్ లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగువందల ముప్పైఅయిదు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది. సమకాలీన జీవితాన్ని చిత్రించేటప్పుడు రచయిత పక్షపాతం చూపకూడదని హెమింగ్వే విశ్వసించాడు. ఒక వంతెన పడగొట్టటంకోసం రాబర్టు జోర్డాన్ అన్న యువ విప్లవవాడి వేసిన పథకాలూ, చేసిన ప్రయత్నాలూ, తర్జన భార్జనలూ, సాటివాళ్ళతో సంఘర్షణలూ, కడపటికి సాధించిన విజయమూ, దాని పర్యవసానాలూ ఈ నవలకి కథావస్తువులు. ఈ నవల హెమింగ్వే రచనా శిల్పానికి చక్కటి నిదర్శనం. మ్రుత్యుచ్చాయలో నాలుగు దినాలపాటు నడిచిన ఉదంతం ఇది. మనిషికి తోటి మానవులతోనూ, సమాజంతోనూ ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని నిరూపించే ఇతివృత్తం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.