1482 జనవరి 6వ తేదీ. ఆనాడు ప్రభాతవేళ పారిస్ నగర వాసులు నగరం నలుమూలల నుండీ వినవచ్చిన దేవాలయ ఘంటారవానికి మేలుకొన్నారు. అరుణోదయ సమయానికే నగరం కోలాహలంతో సంచలితమయింది. అయితే ఈ కోలాహలానికి చరిత్రకెక్కిన హేతువేదీలేదు. తిరుగుబాటూ జరగలేదు. దాడీ జరగలేదు. ఫ్లాండర్స్ నించి రాయబారులు వచ్చినది రెండురోజుల క్రిందట. ఫ్రెంచి రాజకుమారునికి ఫ్లాండర్స్ రాకుమారైతో వివాహం ఏర్పాటు చేయడానికొచ్చారు రాయబారులు. మహారాజుముఖం చూసి, ఫ్లాండర్స్ రాజవంశం పట్ల గల జుగుప్సను లోలోపలే అణచుకొని, బోర్బోన్ కార్డినల్ రాయబారులకు హెూరుమని వర్షం కురిసే సమయంలో విందుచేశాడు. కాని నేటి కోలాహలానికి ఆ రాయభారం కారణం కాదు.
పారిస్ నగరవాసులకు ఈరోజున రెండువిధాల పండుగ. క్రీస్తుదేవుడు అవతరించిన శుభవార్త మేజై దివ్యజ్ఞానులకు తెలియ వచ్చినది జనవరి 6వ తేదీన. రెండోది బికారుల పండుగ. బికారులందరూ చేరి 'మూర్ఖగ్రేసరుడు' ఒకణ్ణి ఎంచుకుని ఉత్సవం జరుపుకుంటారు. ఈరోజున గ్రీవ్ మైదానంలో బాణసంచా కాలుస్తారు. న్యాయస్థాన ప్రాంగణంలో నాటకమొకటి ప్రదర్శిస్తారు.
ఉదయమే ఇళ్లు, అంగళ్లు మూసి నగరవాసులు వీధులలో సంచరించ నారంభించారు. గ్రీవ్ మైదానం, న్యాయస్థాన ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. నాటకానికి ప్లాండర్స్ రాయబారుల్ని ఆహ్వానించారని తెలియవచ్చింది. అక్కడే మూర్ఖుని ఎన్నిక కూడా జరుగుతుంది...................
1482 జనవరి 6వ తేదీ. ఆనాడు ప్రభాతవేళ పారిస్ నగర వాసులు నగరం నలుమూలల నుండీ వినవచ్చిన దేవాలయ ఘంటారవానికి మేలుకొన్నారు. అరుణోదయ సమయానికే నగరం కోలాహలంతో సంచలితమయింది. అయితే ఈ కోలాహలానికి చరిత్రకెక్కిన హేతువేదీలేదు. తిరుగుబాటూ జరగలేదు. దాడీ జరగలేదు. ఫ్లాండర్స్ నించి రాయబారులు వచ్చినది రెండురోజుల క్రిందట. ఫ్రెంచి రాజకుమారునికి ఫ్లాండర్స్ రాకుమారైతో వివాహం ఏర్పాటు చేయడానికొచ్చారు రాయబారులు. మహారాజుముఖం చూసి, ఫ్లాండర్స్ రాజవంశం పట్ల గల జుగుప్సను లోలోపలే అణచుకొని, బోర్బోన్ కార్డినల్ రాయబారులకు హెూరుమని వర్షం కురిసే సమయంలో విందుచేశాడు. కాని నేటి కోలాహలానికి ఆ రాయభారం కారణం కాదు. పారిస్ నగరవాసులకు ఈరోజున రెండువిధాల పండుగ. క్రీస్తుదేవుడు అవతరించిన శుభవార్త మేజై దివ్యజ్ఞానులకు తెలియ వచ్చినది జనవరి 6వ తేదీన. రెండోది బికారుల పండుగ. బికారులందరూ చేరి 'మూర్ఖగ్రేసరుడు' ఒకణ్ణి ఎంచుకుని ఉత్సవం జరుపుకుంటారు. ఈరోజున గ్రీవ్ మైదానంలో బాణసంచా కాలుస్తారు. న్యాయస్థాన ప్రాంగణంలో నాటకమొకటి ప్రదర్శిస్తారు. ఉదయమే ఇళ్లు, అంగళ్లు మూసి నగరవాసులు వీధులలో సంచరించ నారంభించారు. గ్రీవ్ మైదానం, న్యాయస్థాన ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. నాటకానికి ప్లాండర్స్ రాయబారుల్ని ఆహ్వానించారని తెలియవచ్చింది. అక్కడే మూర్ఖుని ఎన్నిక కూడా జరుగుతుంది...................© 2017,www.logili.com All Rights Reserved.