కొత్త దుప్పటి
నెల రోజులైంది చలి మొదలై,
భోజనాలై మంచాలెక్కేసరికే మంచులో తడిసిన గాలి బరువుగా మనుషుల్ని ఆక్రమించు కొంటోంది.
కళ్ళల నిండా తూరు పెత్తని ముడి గింజల కుప్పల్ని దుప్పటై ఆక్రమించుకొనేందుకు మంచు సన్నాహం చేస్తోంది.
కుప్ప కుప్పకూ కాపలాగా ఓ మంచం.
కళ్ళాలలో ఇంకా సద్దుమణగలేదు. పల్చటి మజ్జిగ లాంటి పంచమి చంద్రుని కాంతిలో | కొందరు భోంచేస్తున్నారు. ఇంకొందరు లోకాభిరామాయణాలు బిగ్గరగా చర్చించుకొంటున్నారు. కొన్ని కళ్ళాలలో తల్లుల వెంట ఇంటికెళ్లామని పిల్లలు మారాం చేస్తున్నారు.
విసిరేసినట్టు దూరంగా ఉన్న కళ్ళంలో కుక్కిమంచం మీద కూచుని ఉన్నాడు రామయ్య
“చెప్పలేదంటనక పొయ్యేరూ... నరులార గురునీ జేరి మొక్కిన బతక నేర్చేరూ" అంటూ వీరబ్రహ్మంగారి తత్వాన్ని వణికే కంఠంతో తన్మయంగా పాడుకొంటున్నాడు.
మధ్యమధ్యలో 'ఖల్... ఖణేల్' మని దగ్గు. ఊర్లో వీథి కుక్కలకు యుద్ధం మొదలైనట్లుంది. 'గింజల కుప్ప పక్కనే చిన్న సైజు కొండలా గడ్డి కుప్ప. ఇంకా వామి వేయలేదు. 'దొంగ మనుషులకు లాగే దొంగ గొడ్లకూ కాపలా కాయాలి.
కొందరు తెల్లారుజామున పాలు పిండుకోగానే దొంగ గడ్డికోసం బర్రెల తలుగులు విప్పుతారు. అవి వాటి శక్తి వంచన లేకుండా కడుపు నింపుకొస్తాయి. బంధించి బందెలదొడ్డికి తోల్దామంటే చేతులకు దొరకవు.
మనిషి లేస్తున్న చప్పుడైతే చాలు జింకలా పరువెడతాయి. అందుకే జాగ్రత్తగా కూచుని ఉన్నాడు తాత.
అల్లుడొచ్చేంతవరకు మధ్య మధ్యలో కర్రతో మంచం కోడు కేసి చరుస్తూ 'ఖేయ్' అని గాల్లోకి అరుస్తూ బర్రెల్ని హెచ్చరిస్తున్నాడు...............
కొత్త దుప్పటి నెల రోజులైంది చలి మొదలై, భోజనాలై మంచాలెక్కేసరికే మంచులో తడిసిన గాలి బరువుగా మనుషుల్ని ఆక్రమించు కొంటోంది. కళ్ళల నిండా తూరు పెత్తని ముడి గింజల కుప్పల్ని దుప్పటై ఆక్రమించుకొనేందుకు మంచు సన్నాహం చేస్తోంది. కుప్ప కుప్పకూ కాపలాగా ఓ మంచం. కళ్ళాలలో ఇంకా సద్దుమణగలేదు. పల్చటి మజ్జిగ లాంటి పంచమి చంద్రుని కాంతిలో | కొందరు భోంచేస్తున్నారు. ఇంకొందరు లోకాభిరామాయణాలు బిగ్గరగా చర్చించుకొంటున్నారు. కొన్ని కళ్ళాలలో తల్లుల వెంట ఇంటికెళ్లామని పిల్లలు మారాం చేస్తున్నారు. విసిరేసినట్టు దూరంగా ఉన్న కళ్ళంలో కుక్కిమంచం మీద కూచుని ఉన్నాడు రామయ్య “చెప్పలేదంటనక పొయ్యేరూ... నరులార గురునీ జేరి మొక్కిన బతక నేర్చేరూ" అంటూ వీరబ్రహ్మంగారి తత్వాన్ని వణికే కంఠంతో తన్మయంగా పాడుకొంటున్నాడు. మధ్యమధ్యలో 'ఖల్... ఖణేల్' మని దగ్గు. ఊర్లో వీథి కుక్కలకు యుద్ధం మొదలైనట్లుంది. 'గింజల కుప్ప పక్కనే చిన్న సైజు కొండలా గడ్డి కుప్ప. ఇంకా వామి వేయలేదు. 'దొంగ మనుషులకు లాగే దొంగ గొడ్లకూ కాపలా కాయాలి. కొందరు తెల్లారుజామున పాలు పిండుకోగానే దొంగ గడ్డికోసం బర్రెల తలుగులు విప్పుతారు. అవి వాటి శక్తి వంచన లేకుండా కడుపు నింపుకొస్తాయి. బంధించి బందెలదొడ్డికి తోల్దామంటే చేతులకు దొరకవు. మనిషి లేస్తున్న చప్పుడైతే చాలు జింకలా పరువెడతాయి. అందుకే జాగ్రత్తగా కూచుని ఉన్నాడు తాత. అల్లుడొచ్చేంతవరకు మధ్య మధ్యలో కర్రతో మంచం కోడు కేసి చరుస్తూ 'ఖేయ్' అని గాల్లోకి అరుస్తూ బర్రెల్ని హెచ్చరిస్తున్నాడు...............© 2017,www.logili.com All Rights Reserved.