నా గుండెల్లో
పవిత్రంగా దాచుకున్న
పాదముద్రలే నీవైనపుడు
నువ్కెక్కడుంటే నాకేం..!!
నువ్వు లేవు
నీ జ్ఞాపకం ఉంది
నువ్వులేని నేనులా....!
తిరంలేని ఆ కన్నీటిగోదారికి
నీ పాదం తడిపిన అలల గోదారి సాక్షిగా
నా కళ్ళను తడిపిన నీ మనస్సాక్షిగా
అటు నువ్వు
ఇటు నేను...!!
నీ కళ్ళలో కన్నీటిచుక్కగా మారి
ఆవిరై పోవాలి..
కలకాలం వెలివేయని జ్ఞాపకంగా
నీగుండెల్లో ఉండిపోవాలి
నా సాక్షిగా
నాలోని నీ సాక్షిగా...!!
ఈ విశాల విశ్వానికి
రెండు ధృవాల్లా
నువ్వోవైపు
నేనోవైపు
దగ్గరికి రాలేని నువ్వు
దూరంగా ఉండలేని నేను...!!
చివరి మజిలిలో
నా సమాధిపై తల అంచి రోదించే
కన్నీటి జ్ఞాపకమవుతావ్...!!
నా పిచ్చిగానీ ..
అసలు నేనెవర్ని
నాలో నువ్వు లేకుండా...!!
అక్షరం చెప్పని భావం
మనసు విప్పని మౌనం
నాలో నీకిష్టమైన నీ జ్ఞాపకం...!!
- మాడిశెట్టి శ్రీనివాస్