అభిమాన నటులు అరవైలో పడ్డప్పుడు కనుమరుగవుతారేమోనని కలతపడ్డప్పుడు అద్భుతమైన పాత్రలలో చూపించి ఆనందం చేకూర్చావు. అభిమానులనలరించిన అభినేత్రి సావిత్రి తేరమరుగైందని తెగ మదనపడుతుంటే తెరమీదకు తెచ్చి థ్రిల్ ఇచ్చి మురిపించావు. హీరో హీరోయిన్లకోసం సినిమాలకెగబడేవాళ్ళను డైరెక్టర్లను చూసి సినిమా చూసే స్థాయికి తీసుకువచ్చావు. ఈస్ట్ మన్ కలర్ సినిమాలు ఇరగబడి చూస్తున్నప్పుడు బ్లాక్ & వైట్ సినిమాలను సూపర్ హిట్ చేశావు.
నువ్వు పాలకొల్లు ముఠామేస్త్రివి.. నో డౌట్ ఎట్ ఆల్.. యూ వార్ ఎ వన్ మాన్ ఆర్మీ. సినిమాల్లో నువ్వు తియ్యని సబ్జెక్ట్ లేదు. సాంకేతికపరంగా నీకు తెలియని విషయం లేదు. నవరసాలలో స్పృశించని అంశమంటూ లేదు. పాతతరం నటీనటులకు అవకాశం కల్పిస్తూ కొత్తతరం టాలంట్ కు ప్రోత్సాహం అందిస్తూ అందరినీ కలుపుకుంటూ పెద్దరికం నిలుపుకుంటూ సాహసమే శ్వాసగా సాగిపోతున్న బహుదూరపు బాటసారీ. నీకు నీవే సరి దాసరీ సాటిరారు వేరొకరు మరి..
అభిమాన నటులు అరవైలో పడ్డప్పుడు కనుమరుగవుతారేమోనని కలతపడ్డప్పుడు అద్భుతమైన పాత్రలలో చూపించి ఆనందం చేకూర్చావు. అభిమానులనలరించిన అభినేత్రి సావిత్రి తేరమరుగైందని తెగ మదనపడుతుంటే తెరమీదకు తెచ్చి థ్రిల్ ఇచ్చి మురిపించావు. హీరో హీరోయిన్లకోసం సినిమాలకెగబడేవాళ్ళను డైరెక్టర్లను చూసి సినిమా చూసే స్థాయికి తీసుకువచ్చావు. ఈస్ట్ మన్ కలర్ సినిమాలు ఇరగబడి చూస్తున్నప్పుడు బ్లాక్ & వైట్ సినిమాలను సూపర్ హిట్ చేశావు. నువ్వు పాలకొల్లు ముఠామేస్త్రివి.. నో డౌట్ ఎట్ ఆల్.. యూ వార్ ఎ వన్ మాన్ ఆర్మీ. సినిమాల్లో నువ్వు తియ్యని సబ్జెక్ట్ లేదు. సాంకేతికపరంగా నీకు తెలియని విషయం లేదు. నవరసాలలో స్పృశించని అంశమంటూ లేదు. పాతతరం నటీనటులకు అవకాశం కల్పిస్తూ కొత్తతరం టాలంట్ కు ప్రోత్సాహం అందిస్తూ అందరినీ కలుపుకుంటూ పెద్దరికం నిలుపుకుంటూ సాహసమే శ్వాసగా సాగిపోతున్న బహుదూరపు బాటసారీ. నీకు నీవే సరి దాసరీ సాటిరారు వేరొకరు మరి..© 2017,www.logili.com All Rights Reserved.