హత్యానేరం
డిటెక్టివ్ ఇంద్రజిత్ కళ్ళు మూసుకుని ఆనందంగా సోఫాలో వెనక్కి వాలాడు. ప్రమీల అతని ప్రక్కనే కూర్చుని ఏదో దినపత్రిక పేజీలు తిరగవేస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది.
హోటల్ అంతా కలకత్తా మహానగరంలో పేరు పొందిన విశ్రాంతి భవనం. ప్రాచ్యపాశ్చాత్య సభ్యతల కనుగుణంగా అన్ని ఏర్పాట్లతో అందరినీ ఆకర్షిస్తుందా హెూటల్. "ఎక్కడికేని వెళ్ళి ఓ వారం హాయిగా గడిపివద్దాం" అంది ప్రమీల ఓసారి, మద్రాస్లో జీవితంతో విసుగెత్తి.
"అందుకు సిద్ధం” అన్నాడు ఇంద్రజిత్.
"మరి ఎక్కడి వెళ్లాం," ఆమె అడిగింది.
"నీ ఇష్టం,” అతనన్నాడు.
"కలకత్తా చూసి చాలా కాలమైంది, ఓసారి వెళ్లాం. ఆ మహానగరపు వాతావరణం నాకెంతో హాయిగా ఉంటుంది," అంది ప్రమీల.
ఇంద్రజిత్ ముందుగానే సిద్ధపడ్డాడు. లేడికి లేచిందే పరుగన్నట్టుగా ఉద్దేశం కలగగానే ఆ రాత్రే ప్రయాణం పెట్టుకున్నారు డిటెక్టివ్ దంపతులు.
చివరికి కలకత్తా మెయిల్ వాళ్లిద్దర్నీ హౌరాస్టేషన్లో దింపింది. అక్కడనించి తిన్నగా అజంతా హెూటల్కి బయలుదేరారు వాళ్ళిద్దరూ. చక్కని వసతులు సౌకర్యాలు గల ఆ హోటల్లో ఒక గది తీసుకున్నారు.
ఆ రోజు మామూలుగా గడిచిపోయింది. సాయంకాలం కాసేపు టాక్సీలో బయలుదేరి అక్కడక్కడా తిరిగి వచ్చారు. నిత్యం ఏదో కేసును పరిశోధిస్తూ ఉంటే ఇంద్రజితు కొంచెం విశ్రాంతి లభించినట్లయింది. ఒక వారంరోజులు ఎలాంటి పనులు పెట్టుకోకుండా పూర్తిగా ఆనందంతో కాలక్షేపం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
మరునాడు ఇంద్రజిత్ కాఫీ తాగి ఆనందంగా సోఫాలో వెనక్కి వాలాడు. అతని మనస్సులో ఇప్పుడెలాంటి ఆలోచనలూ లేవు, ప్రశాంతంగా ఉంది మనస్సు. ప్రమీలకూడా అతని ప్రక్కనే కూర్చుని దినపత్రిక తిరగవేస్తోంది..................
హత్యానేరం డిటెక్టివ్ ఇంద్రజిత్ కళ్ళు మూసుకుని ఆనందంగా సోఫాలో వెనక్కి వాలాడు. ప్రమీల అతని ప్రక్కనే కూర్చుని ఏదో దినపత్రిక పేజీలు తిరగవేస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. హోటల్ అంతా కలకత్తా మహానగరంలో పేరు పొందిన విశ్రాంతి భవనం. ప్రాచ్యపాశ్చాత్య సభ్యతల కనుగుణంగా అన్ని ఏర్పాట్లతో అందరినీ ఆకర్షిస్తుందా హెూటల్. "ఎక్కడికేని వెళ్ళి ఓ వారం హాయిగా గడిపివద్దాం" అంది ప్రమీల ఓసారి, మద్రాస్లో జీవితంతో విసుగెత్తి. "అందుకు సిద్ధం” అన్నాడు ఇంద్రజిత్. "మరి ఎక్కడి వెళ్లాం," ఆమె అడిగింది. "నీ ఇష్టం,” అతనన్నాడు. "కలకత్తా చూసి చాలా కాలమైంది, ఓసారి వెళ్లాం. ఆ మహానగరపు వాతావరణం నాకెంతో హాయిగా ఉంటుంది," అంది ప్రమీల. ఇంద్రజిత్ ముందుగానే సిద్ధపడ్డాడు. లేడికి లేచిందే పరుగన్నట్టుగా ఉద్దేశం కలగగానే ఆ రాత్రే ప్రయాణం పెట్టుకున్నారు డిటెక్టివ్ దంపతులు. చివరికి కలకత్తా మెయిల్ వాళ్లిద్దర్నీ హౌరాస్టేషన్లో దింపింది. అక్కడనించి తిన్నగా అజంతా హెూటల్కి బయలుదేరారు వాళ్ళిద్దరూ. చక్కని వసతులు సౌకర్యాలు గల ఆ హోటల్లో ఒక గది తీసుకున్నారు. ఆ రోజు మామూలుగా గడిచిపోయింది. సాయంకాలం కాసేపు టాక్సీలో బయలుదేరి అక్కడక్కడా తిరిగి వచ్చారు. నిత్యం ఏదో కేసును పరిశోధిస్తూ ఉంటే ఇంద్రజితు కొంచెం విశ్రాంతి లభించినట్లయింది. ఒక వారంరోజులు ఎలాంటి పనులు పెట్టుకోకుండా పూర్తిగా ఆనందంతో కాలక్షేపం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. మరునాడు ఇంద్రజిత్ కాఫీ తాగి ఆనందంగా సోఫాలో వెనక్కి వాలాడు. అతని మనస్సులో ఇప్పుడెలాంటి ఆలోచనలూ లేవు, ప్రశాంతంగా ఉంది మనస్సు. ప్రమీలకూడా అతని ప్రక్కనే కూర్చుని దినపత్రిక తిరగవేస్తోంది..................© 2017,www.logili.com All Rights Reserved.