లక్షకోహత్య
స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలకొస్తున్న మిస్ సురేఖవైపు అశ్వద్ధామ నవ్వుతూ చూశాడు. పెదిమల మధ్యనున్న సిగరెట్ని చేతిలోకి తీసుకున్నాడు. రొటేటింగ్ కుర్చీలో వెనక్కు వాలాడు.
సురేఖ వయ్యారంగా అతని పక్కకు నడిచింది. అతని ఎడంచెయ్యి సన్నటి ఆమె నడుమును చుట్టేసింది.
"రేఖా! ఎవరో తరుముకున్నట్లు గదిలోకి వచ్చావు." అన్నాడతను.
"బయట గదిలో ఒక స్త్రీ కూర్చునివుంది, మీతో అర్జంటుగా మాట్లాడాలట." అంది సురేఖ.
"ఆమెకు ఏంకావాలి?"
"నేనడిగితే ఆమె చెప్పలేదు. మీతో మాట్లాడాలన్నది."
"ఆల్టైట్! రమ్మను." అన్నాడతను.
సురేఖ గబగబ బయటకు వెళ్ళింది. అశ్వద్ధామ ఆనందంతో ఆమెవంక చూస్తున్నాడు. లేత ఆకుపచ్చరంగు నైలాన్ చీరలో సురేఖ అప్సరసలావుంది.
అశ్వద్ధామ స్టేట్ఎక్స్ప్రెస్ 555 ఫిల్టర్ సిగరెట్ వెలిగించాడు. సురేఖ ఒక స్త్రీతో ఏర్ కండిషండ్ గదిలోకి వచ్చింది. అశ్వద్ధామ కుర్చీలోంచి లేచి ఆమెను కూర్చోమన్నాడు. ఎదురుగావున్న కుషన్ కుర్చీలో ఆమె కూర్చుంది.
అశ్వద్దామ కుడి వైపునున్న కుర్చీలో సురేఖ చతికిల బడింది. ఆమె నోటబుక్ను తెరచి పట్టుకుంది. చేతిలో బాల్ పాయింట్ పెన్ మెరుస్తోంది. "అశ్వద్ధామగారూ! నా పేరు కాంచన." అందామె.
క్షణకాలం అతను ఆమెవైపు పరీక్షగా చూశాడు. కాంచన వయస్సు ముప్పయి పైన వుంటుంది. ఖరీదయిన దుస్తులు ధరించింది. మెళ్ళో రెండు గొలుసులున్నాయి. చెపుకున్న దుద్దుల్లోని తెల్ల డైమండ్స్ తళతళ మెరుస్తున్నాయి. ఎడంచేతికి ఖరీదయిన వాచంది. కాంచన సంపన్న కుటుంబానికి చెందినదై వుండాలి. "ఏంకావాలో చెప్పండి!" అన్నాడతను చిరు నవ్వుతో.
సురేఖమీదనించి ఆమె చూపు అతనివైపు మళ్ళింది.
"ప్రఖ్యాత నగల వ్యాపారస్తుడు సాండా రంగయ్య గారి పేరు మీరు వినుండొచ్చు!" అందామె.
"దినపత్రికల్లో అయన కంపెనీ ప్రకటనలు చూశాను".......................
లక్షకోహత్య స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలకొస్తున్న మిస్ సురేఖవైపు అశ్వద్ధామ నవ్వుతూ చూశాడు. పెదిమల మధ్యనున్న సిగరెట్ని చేతిలోకి తీసుకున్నాడు. రొటేటింగ్ కుర్చీలో వెనక్కు వాలాడు. సురేఖ వయ్యారంగా అతని పక్కకు నడిచింది. అతని ఎడంచెయ్యి సన్నటి ఆమె నడుమును చుట్టేసింది. "రేఖా! ఎవరో తరుముకున్నట్లు గదిలోకి వచ్చావు." అన్నాడతను. "బయట గదిలో ఒక స్త్రీ కూర్చునివుంది, మీతో అర్జంటుగా మాట్లాడాలట." అంది సురేఖ. "ఆమెకు ఏంకావాలి?" "నేనడిగితే ఆమె చెప్పలేదు. మీతో మాట్లాడాలన్నది." "ఆల్టైట్! రమ్మను." అన్నాడతను. సురేఖ గబగబ బయటకు వెళ్ళింది. అశ్వద్ధామ ఆనందంతో ఆమెవంక చూస్తున్నాడు. లేత ఆకుపచ్చరంగు నైలాన్ చీరలో సురేఖ అప్సరసలావుంది. అశ్వద్ధామ స్టేట్ఎక్స్ప్రెస్ 555 ఫిల్టర్ సిగరెట్ వెలిగించాడు. సురేఖ ఒక స్త్రీతో ఏర్ కండిషండ్ గదిలోకి వచ్చింది. అశ్వద్ధామ కుర్చీలోంచి లేచి ఆమెను కూర్చోమన్నాడు. ఎదురుగావున్న కుషన్ కుర్చీలో ఆమె కూర్చుంది. అశ్వద్దామ కుడి వైపునున్న కుర్చీలో సురేఖ చతికిల బడింది. ఆమె నోటబుక్ను తెరచి పట్టుకుంది. చేతిలో బాల్ పాయింట్ పెన్ మెరుస్తోంది. "అశ్వద్ధామగారూ! నా పేరు కాంచన." అందామె. క్షణకాలం అతను ఆమెవైపు పరీక్షగా చూశాడు. కాంచన వయస్సు ముప్పయి పైన వుంటుంది. ఖరీదయిన దుస్తులు ధరించింది. మెళ్ళో రెండు గొలుసులున్నాయి. చెపుకున్న దుద్దుల్లోని తెల్ల డైమండ్స్ తళతళ మెరుస్తున్నాయి. ఎడంచేతికి ఖరీదయిన వాచంది. కాంచన సంపన్న కుటుంబానికి చెందినదై వుండాలి. "ఏంకావాలో చెప్పండి!" అన్నాడతను చిరు నవ్వుతో. సురేఖమీదనించి ఆమె చూపు అతనివైపు మళ్ళింది. "ప్రఖ్యాత నగల వ్యాపారస్తుడు సాండా రంగయ్య గారి పేరు మీరు వినుండొచ్చు!" అందామె. "దినపత్రికల్లో అయన కంపెనీ ప్రకటనలు చూశాను".......................© 2017,www.logili.com All Rights Reserved.