Title | Price | |
Jeevana Yatra | Rs.100 | In Stock |
చిన్నతనంలోనే తల్లిదండ్రుల మమతానురాగాలను కోల్పోయిన అభాగ్యురాలు ఆమె. తాతయ్య ఒడిలో సేదతీరి కష్టాలను మరచిపోయేది. వివాహబంధం జీవితంలో మలుపు కాగా సుబ్బారావుకు భార్యయై మెట్టినింట అడుగుపెట్టింది. భర్తచే అనురాగంతో 'శాంతీ' అని పిలిపించుకున్న ఆ చిన్నారి పదమూడేళ్ళ శాంతి తన నడవడికతో ఊరంతటికి శాంతమ్మ తల్లి అయింది. జీవితంలో తాను ఏ తల్లి మమతానురాగాలను కోల్పోయిందో వాటిని తన మరిది ఆడపడుచులకు తల్లియై పంచిపెట్టింది. వారిరువురిని తన బిడ్డలుగా సాకుతూ తన నలుగురు బిడ్డలకు తల్లయింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారినిబట్టి నూతన బంధుత్వాలు ఆమె బంధాలు ఏర్పడ్డాయి.
తన జీవనయాత్రలో తారసపడ్డ ప్రతి ఒక్కరికి ఆమె తల్లియై తన ప్రేమానురాగాలతో వారి జీవితాలకు వెలుగునిచ్చింది. కానీ ఆమె జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక వెలితి. కొంతకాలం ఆర్థికంగా, మరీ కొంతకాలం మానసికంగా... మధ్యతరగతి సంసారంలోని సుఖదుఃఖాలకు, పాత్రల మనోభావాలకు మాదిరెడ్డి సులోచన పట్టిన దర్పణం "జేవ్నయాత్ర".
చిన్నతనంలోనే తల్లిదండ్రుల మమతానురాగాలను కోల్పోయిన అభాగ్యురాలు ఆమె. తాతయ్య ఒడిలో సేదతీరి కష్టాలను మరచిపోయేది. వివాహబంధం జీవితంలో మలుపు కాగా సుబ్బారావుకు భార్యయై మెట్టినింట అడుగుపెట్టింది. భర్తచే అనురాగంతో 'శాంతీ' అని పిలిపించుకున్న ఆ చిన్నారి పదమూడేళ్ళ శాంతి తన నడవడికతో ఊరంతటికి శాంతమ్మ తల్లి అయింది. జీవితంలో తాను ఏ తల్లి మమతానురాగాలను కోల్పోయిందో వాటిని తన మరిది ఆడపడుచులకు తల్లియై పంచిపెట్టింది. వారిరువురిని తన బిడ్డలుగా సాకుతూ తన నలుగురు బిడ్డలకు తల్లయింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారినిబట్టి నూతన బంధుత్వాలు ఆమె బంధాలు ఏర్పడ్డాయి. తన జీవనయాత్రలో తారసపడ్డ ప్రతి ఒక్కరికి ఆమె తల్లియై తన ప్రేమానురాగాలతో వారి జీవితాలకు వెలుగునిచ్చింది. కానీ ఆమె జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక వెలితి. కొంతకాలం ఆర్థికంగా, మరీ కొంతకాలం మానసికంగా... మధ్యతరగతి సంసారంలోని సుఖదుఃఖాలకు, పాత్రల మనోభావాలకు మాదిరెడ్డి సులోచన పట్టిన దర్పణం "జేవ్నయాత్ర".© 2017,www.logili.com All Rights Reserved.