అతి సాధారణ వ్యక్తుల గురించి నిక్కచ్చిగా వ్రాసిన నవల. పుణ్యపాపాలు బేరీజు వేసుకుంటే ఏం మిగులుతుంది? సంతోష శిఖరాల మీద విషాదం పేరుకునుంటుందా? అన్న నిర్వేదంతో ముగిసిన ఈ కలలనీడలు..
ఓ అతి పల్చటి నల్లటి పరదాలోపల దాక్కొని కనీకన్పించని లింగమూర్తులూ.. నిత్య శంకితురాలై జీవితాన్ని దుర్భరం చేసుకున్న బాలామణి అనబడే లింగమూర్తి భార్యా.. హరి, కాంతం అనబడే నాయికా నాయకులు ప్రముఖంగా కనపడే పాత్రలు, శ్రీ పార్థ సారథిగారికి అభినందనలు.
బుద్ధిగా, అణకువగా సంసారాలు చేసుకుంటున్న స్త్రీలు, వేరే అవకాశాలు లేకనే రెక్కల్లేని పక్షుల్లా ఇలా పడి ఉంటున్నారా? ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారా? శారీరక హింసకూ, కామాతుర లిప్పల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల Nuances ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ, స్వేద బిందువులనూ Transparent ఊసుల పూసలుగా చేసి దారానికి గుచ్చి అల్లిన దండ దమయంతి. మనం సాంఘికంగా, సాంకేతికంగా, శాస్త్రపరంగా ఎంత అభివృద్ధి సాధించినా స్త్రీ పరిస్థితుల్లో మార్పు బహుస్వల్పమని మనందరికే గుర్తు చేసే నవల దమయంతి.
అతి సాధారణ వ్యక్తుల గురించి నిక్కచ్చిగా వ్రాసిన నవల. పుణ్యపాపాలు బేరీజు వేసుకుంటే ఏం మిగులుతుంది? సంతోష శిఖరాల మీద విషాదం పేరుకునుంటుందా? అన్న నిర్వేదంతో ముగిసిన ఈ కలలనీడలు.. ఓ అతి పల్చటి నల్లటి పరదాలోపల దాక్కొని కనీకన్పించని లింగమూర్తులూ.. నిత్య శంకితురాలై జీవితాన్ని దుర్భరం చేసుకున్న బాలామణి అనబడే లింగమూర్తి భార్యా.. హరి, కాంతం అనబడే నాయికా నాయకులు ప్రముఖంగా కనపడే పాత్రలు, శ్రీ పార్థ సారథిగారికి అభినందనలు. బుద్ధిగా, అణకువగా సంసారాలు చేసుకుంటున్న స్త్రీలు, వేరే అవకాశాలు లేకనే రెక్కల్లేని పక్షుల్లా ఇలా పడి ఉంటున్నారా? ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారా? శారీరక హింసకూ, కామాతుర లిప్పల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల Nuances ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ, స్వేద బిందువులనూ Transparent ఊసుల పూసలుగా చేసి దారానికి గుచ్చి అల్లిన దండ దమయంతి. మనం సాంఘికంగా, సాంకేతికంగా, శాస్త్రపరంగా ఎంత అభివృద్ధి సాధించినా స్త్రీ పరిస్థితుల్లో మార్పు బహుస్వల్పమని మనందరికే గుర్తు చేసే నవల దమయంతి.© 2017,www.logili.com All Rights Reserved.