సాహిత్యమంటే కేవలం హిత వాక్యం కాదు. హితంతో కూడుకున్న వాక్యం. హితం పట్ల మనకి హితువు కలిగించేదేదో మరొకటి ఉండాలి. అదే సాహిత్య కళ. మంచి రచన అంటే కొన్ని అభిప్రాయాలని ఏకరవు పెట్టడం కాదు. ఎంత ఉద్వేగంతో చెప్పినప్పటికీ ఎంత నిజాయితితో ఆవేదనతో ప్రకటించినప్పటికీ అభిప్రాయాలు అభిప్రాయాలే. రచయితలు తమ అభిప్రాయాలని మన అభిప్రాయాలుగా మార్చాలంటే నమ్మదగ్గట్టుగా కథలు చెప్పాలి. చెప్పడం కాదు. ఆ కథల్లో మానవ ప్రవర్తన సంఘటనా క్రమం మనకి చూపించాలి. ఆ మనుష్యుల సుఖదుఃఖాలతో మనకొక తదత్కమాతను సిద్దీoపచేయాలి. అది సాధ్యపడినప్పుడే ఆ రచన పది కాలాలపాటు పాఠకుల మనసుల్లో సజీవంగా నిలబడిపోతుంది.
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న కాశీపట్నం చూడర బాబూ నవలనే చుడండి. ఈ నవల అది సాదించిందనటానికే ఎన్నో గుర్తులున్నాయి. జాగృతి వార పత్రికలో ప్రచురితమవుతున్నప్పుడే అసంఖ్యాకులయిన పాఠకుల అభిమానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మీరు కూడా చదవడం మొదలు పెట్టగానే అటువంటి ఆహ్లాదానుభూతికి హృదయసంస్పర్శకి లోను కాబోతున్నారని నాకు తెలుసు.
మణి వడ్లమాని