పరుగు ఆపడం ఒక కళ
ఏ పనైనా ఎక్కడ మొదలుపెట్టాలో.... విజయం సాధించడానికి ఏం చేయాలో మనందరికీ తెలుసు. కానీ, ఎక్కడ ఆపితే విజయాన్ని ఆస్వాదించగలమో ఎంతమందికి తెలుసు? నిజానికి అది తెలియడమే విజయ రహస్యం! డబ్బు, పేరు... ఏదైనా సరే అన్నిటికి ఒక స్థాయి తరువాత 'ఇక చాలు.....' అని చెప్పడమే అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇదే అసలైన జీవిత సూత్రం. ఈ జీవిత సారాన్ని ఆకళింపు చేసుకున్న సోగ్గాడి జీవనయనాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించడమే ఈ ప్రయత్నం. శోభన్ నటన, నిజ జీవితాలకు సంబంధించిన అనేకానేక సంఘటనల సమాహారం ఈ పుస్తకం. మీడియాకు ఆమడ దూరంలో ఉండే శోభన్ వ్యక్తిగత జీవిత అంశాలెన్నిటినో వివరిస్తున్న తొలి తెలుగు పుస్తకం. ఇది.
చదవగలిగితే, జీవితంలో ఘన విజయాలను సాధించిన జీవితాలన్నీ గొప్ప గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తాకాలుగానే నిలుస్తాయి. పరిగెత్తాలనుకునే వ్యక్తి ముందుగా నిలబడగలగాలి. కుదురుగా నడవగలగాలి. తప్పటడుగులు సరిదిద్దుకోవాలి. తప్పుదారులను దారి తప్పడాలను గ్రహిస్తుండాలి. సర్వశక్తుల్ని పరుగుపై కేంద్రీకరించగలగాలి. పరుగు తీరాన్ని దాటి తీరాలి. మరుక్షణం పరుగును ఆపి, అనుభూతులతో సేదదీరగలగాలి.
ప్రపంచ సినీ చరిత్రకే వన్నేతేగల వారెందరో తెలుగు చిత్రసీమలో ఉన్నా, వారిలో కొందరిపైనే జీవిత చరిత్రలు వెలువడ్డాయి. వాటిలో కూడా జీవిత చరిత్రలను జీవిత ఘట్టాల ఆవిష్కరణలుగానే తప్పితే, సారపు ఆవిష్కరణలుగా రాసిన రచనలు చాలా తక్కువ. ఈ రకంగా చూస్తే ఇది ఒక వినూత్న రచన. జీవిత చరిత్రల్లో ఉండే చారిత్రక ఘట్టాల ఆవిష్కరణను, జీవన మాధుర్య సౌరభాలను ఆవిష్కరిస్తూనే, వ్యక్తిత్వి వికాస గ్రంథాలు అందించే సుతిమెత్తని జీవిత సత్యాలను భోదిస్తుంది ఈ రచన. రచనను రచయిత చేసినట్టుగా కాకుండా, శోభన్ బాబు గారే స్వయంగా చెప్పినట్టుగా కథానాన్ని కొనసాగించడం ఇందులోని మరో ప్రత్యేకత. ఇంకా మరిన్ని సొగసులతో తిర్చిదిద్దిన కొత్త ఎడిషన్ ఇది. మీ ఆదరాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ..................................
-ఆకెళ్ళ రాఘవేంద్ర.
పరుగు ఆపడం ఒక కళ ఏ పనైనా ఎక్కడ మొదలుపెట్టాలో.... విజయం సాధించడానికి ఏం చేయాలో మనందరికీ తెలుసు. కానీ, ఎక్కడ ఆపితే విజయాన్ని ఆస్వాదించగలమో ఎంతమందికి తెలుసు? నిజానికి అది తెలియడమే విజయ రహస్యం! డబ్బు, పేరు... ఏదైనా సరే అన్నిటికి ఒక స్థాయి తరువాత 'ఇక చాలు.....' అని చెప్పడమే అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇదే అసలైన జీవిత సూత్రం. ఈ జీవిత సారాన్ని ఆకళింపు చేసుకున్న సోగ్గాడి జీవనయనాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించడమే ఈ ప్రయత్నం. శోభన్ నటన, నిజ జీవితాలకు సంబంధించిన అనేకానేక సంఘటనల సమాహారం ఈ పుస్తకం. మీడియాకు ఆమడ దూరంలో ఉండే శోభన్ వ్యక్తిగత జీవిత అంశాలెన్నిటినో వివరిస్తున్న తొలి తెలుగు పుస్తకం. ఇది. చదవగలిగితే, జీవితంలో ఘన విజయాలను సాధించిన జీవితాలన్నీ గొప్ప గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తాకాలుగానే నిలుస్తాయి. పరిగెత్తాలనుకునే వ్యక్తి ముందుగా నిలబడగలగాలి. కుదురుగా నడవగలగాలి. తప్పటడుగులు సరిదిద్దుకోవాలి. తప్పుదారులను దారి తప్పడాలను గ్రహిస్తుండాలి. సర్వశక్తుల్ని పరుగుపై కేంద్రీకరించగలగాలి. పరుగు తీరాన్ని దాటి తీరాలి. మరుక్షణం పరుగును ఆపి, అనుభూతులతో సేదదీరగలగాలి. ప్రపంచ సినీ చరిత్రకే వన్నేతేగల వారెందరో తెలుగు చిత్రసీమలో ఉన్నా, వారిలో కొందరిపైనే జీవిత చరిత్రలు వెలువడ్డాయి. వాటిలో కూడా జీవిత చరిత్రలను జీవిత ఘట్టాల ఆవిష్కరణలుగానే తప్పితే, సారపు ఆవిష్కరణలుగా రాసిన రచనలు చాలా తక్కువ. ఈ రకంగా చూస్తే ఇది ఒక వినూత్న రచన. జీవిత చరిత్రల్లో ఉండే చారిత్రక ఘట్టాల ఆవిష్కరణను, జీవన మాధుర్య సౌరభాలను ఆవిష్కరిస్తూనే, వ్యక్తిత్వి వికాస గ్రంథాలు అందించే సుతిమెత్తని జీవిత సత్యాలను భోదిస్తుంది ఈ రచన. రచనను రచయిత చేసినట్టుగా కాకుండా, శోభన్ బాబు గారే స్వయంగా చెప్పినట్టుగా కథానాన్ని కొనసాగించడం ఇందులోని మరో ప్రత్యేకత. ఇంకా మరిన్ని సొగసులతో తిర్చిదిద్దిన కొత్త ఎడిషన్ ఇది. మీ ఆదరాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ.................................. -ఆకెళ్ళ రాఘవేంద్ర.
© 2017,www.logili.com All Rights Reserved.