కవిద్వయము
"యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్”
"ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదాం,
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్”
ఈ మొదలైన విధంగా ప్రయాణ మంగళ దేవతలను శ్రీనాథ కవిసార్వభౌముడు తన శ్రీశైలయాత్ర చివరి మజిలీలో ధ్యానించినాడు. ఆనాటి ఉదయమే, జాముప్రొద్దువేళ, అతడు సపరివారముగా శిఖరేశ్వరము చేరుకొన్నాడు. శిఖరేశ్వరస్వామిని భక్తిపూర్వకముగా రుద్రాభిషేకముతో అర్చించినాడు. ఆలయ సమీపమందే ఆనుకొని నిలువున నిలిచి ఉన్న మహాశిలపైకి భార్య భూదేవితో అధిరోహించి తిలాదికముతో ఉలూఖలమందు యాత్రికులు చేసే శిష్టాచారము నెరపినాడు. కాని ఆ అమృత బిందువులు, వారు తమ శిరస్సులను ఎంత ఒగ్గినను, వారి తలలపై పడలేదు. అక్కడినుండి మూడు కోసుల దూరంగా వున్న శ్రీశైల నగరమువెళ్లి అందలి భ్రమరాంబా మల్లికార్జునుల ఆలయములు దర్శించి మ్రొక్కినారు. చెట్లతో, పొదలతో, శిలలతో ఆవరింపబడి ఉన్నా స్పష్టముగా స్వామి ఆలయ శిఖరము వాళ్లకు కనిపించింది. ఇద్దరూ ఆ శిఖర కనకకుంభానికి భక్తితో నమస్కరించినారు.
ఆ తర్వాత దగ్గరనే ఉన్న మహాపుష్కరిణీతీరాన చల్లని చెట్ల నీడలలో వండిన ఆహారము సదాశివునికి నివేదించి ప్రసాద మరగించి శ్రీనాథుడు విశ్రమించినాడు. మూడు జాముల వేళకు అతడు శుచియై యాత్రోన్ముఖుడై పై విధముగా ప్రయాణ మంగళ దేవతలను స్మరించినాడు....................
కవిద్వయము "యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయో స్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్” "ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదాం,లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్” ఈ మొదలైన విధంగా ప్రయాణ మంగళ దేవతలను శ్రీనాథ కవిసార్వభౌముడు తన శ్రీశైలయాత్ర చివరి మజిలీలో ధ్యానించినాడు. ఆనాటి ఉదయమే, జాముప్రొద్దువేళ, అతడు సపరివారముగా శిఖరేశ్వరము చేరుకొన్నాడు. శిఖరేశ్వరస్వామిని భక్తిపూర్వకముగా రుద్రాభిషేకముతో అర్చించినాడు. ఆలయ సమీపమందే ఆనుకొని నిలువున నిలిచి ఉన్న మహాశిలపైకి భార్య భూదేవితో అధిరోహించి తిలాదికముతో ఉలూఖలమందు యాత్రికులు చేసే శిష్టాచారము నెరపినాడు. కాని ఆ అమృత బిందువులు, వారు తమ శిరస్సులను ఎంత ఒగ్గినను, వారి తలలపై పడలేదు. అక్కడినుండి మూడు కోసుల దూరంగా వున్న శ్రీశైల నగరమువెళ్లి అందలి భ్రమరాంబా మల్లికార్జునుల ఆలయములు దర్శించి మ్రొక్కినారు. చెట్లతో, పొదలతో, శిలలతో ఆవరింపబడి ఉన్నా స్పష్టముగా స్వామి ఆలయ శిఖరము వాళ్లకు కనిపించింది. ఇద్దరూ ఆ శిఖర కనకకుంభానికి భక్తితో నమస్కరించినారు. ఆ తర్వాత దగ్గరనే ఉన్న మహాపుష్కరిణీతీరాన చల్లని చెట్ల నీడలలో వండిన ఆహారము సదాశివునికి నివేదించి ప్రసాద మరగించి శ్రీనాథుడు విశ్రమించినాడు. మూడు జాముల వేళకు అతడు శుచియై యాత్రోన్ముఖుడై పై విధముగా ప్రయాణ మంగళ దేవతలను స్మరించినాడు....................© 2017,www.logili.com All Rights Reserved.