కవిసమ్రాట్ నోరినరసింహశాస్త్రి (6.2.1900 - 03.01.1978) తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసినవారు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, విమర్శకుడు.
భావకవితాయుగంలో కవిత్వ రచన ఆరంభించిన శాస్త్రి గారు తన యౌవన ప్రారంభ దశలో విశృంఖలంగా రచనలు చేసి మానసిక పరిణతి కలిగినంతనే వాటినన్నిటిని తగులబెట్టారు. అప్పటి వరకున్న నరసింహశాస్త్రి గారు వేరు, తర్వాతి నరసింహశాస్త్రి గారు వేరు.
సాహిత్యానికి ఆర్షదృష్టి ఉండాలన్నది ఆయన అభిమతం. ఆ దృష్టితోనే ఆయన ప్రాచీన మహాకవుల రచనలన్నింటినీ పరిశీలించారు. వ్యాస వాల్మీకులూ, కవిత్రయమూ, పోతనా ఆయన కెంతగానో అభిమానపాత్రులు.
- డా.డి. చంద్రశేఖర రెడ్డి