ఎందుకు? ఎలా?
బందిపోటు దొంగలాగాక, కన్నం దొంగలా, దేశ రాజకీయ జీవితంలోకి రాత్రికి రాత్రి దూరివచ్చింది ఎమర్జన్సీ. కేంద్ర మంత్రివర్గంలోని ముఖ్యులకైనా తెలియనంత రహస్యమై, సిద్ధార్థశంకర్ బారిస్టర్ తెలివితో రూపొందించిన ఎమర్జన్సీ ప్రకటన నాటి ప్రధాని ఆమోదం పొందాకనే నాటి రాష్ట్రపతి సంతకానికోసం, నెం.1. సఫ్టర్డింగ్లోడ్డును వదిలి కారెక్కి నీరవరాజమార్గం మీదుగా, రాష్ట్రపతి భవన్కు వెళ్ళింది. మరికొద్ది సేపటికే సంతృప్తితో వెనక్కు మళ్ళింది - దేశంవైపు.
బూర్జువా ప్రజాస్వామిక పద్ధతులకు గూడా పుట్టగతులు లేనంతటి రాజకీయ.
1975 జూన్ 26న భారతదేశానికి పర్యాయపదమై కూర్చుంది. అయితే ఆనాడే ఏకవ్యక్తి నిరంకుశత్వం మొదలైందని చెప్పడం అబద్ధం. 1971 ఎన్నికలలోనే దానికి బీజారోపం జరిగిందని చెప్పవచ్చు. ఇంకా రెండేళ్ళు వెనక్కికూడా వెళ్లి, కాంగ్రెసు ముసలంలోనే దీన్ని కనుక్కోవచ్చు. కాంగ్రెసు అధ్యక్షస్థానంలో ఉండి 'ప్రజావెల్లువ' సాకుతోటి కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కూలదోయించిన తరుణమే వ్యక్తి నిరంకుశత్వ అవతరణకు ప్రారంభమని కూడా చెప్పవచ్చు.
రాజకీయ స్వాతంత్య్రానంతరం ముప్పైఏళ్ళు నిరంతరాయంగా సాగిన ఏకపక్ష 'నియంతృత్వమే దీనికి అనువైన వాతావరణాన్ని కల్పించింది. రాజకీయ నాయకత్వానికి, మతప్రవక్తకుగల మహిమాన్విత ఆకర్షణ (కెరిస్మా)ను కలిగించడమనేది వెనకబడిన సమాజాల జీవిత విశేషాలలో ఒకటి. అది మహాత్మాగాంధీకైతే తగునేమోగాని, ఆయన ఇంటిపేరు తన సొంత పేరుగా చేసుకున్న ఇందిరా నెహ్రూకు తలకెక్కిపోయింది. తండ్రి జవహర్లాల్, తాత మోతీలాల్, అమ్మ కమల, నానమ్మ స్వరూప్ రాణి, అందరూ ఒకరికి తగ్గి మరొకరు జాతీయోద్యమంలో త్యాగాలు చేసి కష్టాలుపడి సమకూర్చిపెట్టిన కీర్తినీ ప్రజాభిమానాన్నీ రాజకీయ రొక్కం చేసుకునేందుకు పూనుకున్నారు ఇందిరాగాంధీ, సుపుత్రుడు సంజయ్ గాంధీ.......................
ఎందుకు? ఎలా? బందిపోటు దొంగలాగాక, కన్నం దొంగలా, దేశ రాజకీయ జీవితంలోకి రాత్రికి రాత్రి దూరివచ్చింది ఎమర్జన్సీ. కేంద్ర మంత్రివర్గంలోని ముఖ్యులకైనా తెలియనంత రహస్యమై, సిద్ధార్థశంకర్ బారిస్టర్ తెలివితో రూపొందించిన ఎమర్జన్సీ ప్రకటన నాటి ప్రధాని ఆమోదం పొందాకనే నాటి రాష్ట్రపతి సంతకానికోసం, నెం.1. సఫ్టర్డింగ్లోడ్డును వదిలి కారెక్కి నీరవరాజమార్గం మీదుగా, రాష్ట్రపతి భవన్కు వెళ్ళింది. మరికొద్ది సేపటికే సంతృప్తితో వెనక్కు మళ్ళింది - దేశంవైపు. బూర్జువా ప్రజాస్వామిక పద్ధతులకు గూడా పుట్టగతులు లేనంతటి రాజకీయ. 1975 జూన్ 26న భారతదేశానికి పర్యాయపదమై కూర్చుంది. అయితే ఆనాడే ఏకవ్యక్తి నిరంకుశత్వం మొదలైందని చెప్పడం అబద్ధం. 1971 ఎన్నికలలోనే దానికి బీజారోపం జరిగిందని చెప్పవచ్చు. ఇంకా రెండేళ్ళు వెనక్కికూడా వెళ్లి, కాంగ్రెసు ముసలంలోనే దీన్ని కనుక్కోవచ్చు. కాంగ్రెసు అధ్యక్షస్థానంలో ఉండి 'ప్రజావెల్లువ' సాకుతోటి కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కూలదోయించిన తరుణమే వ్యక్తి నిరంకుశత్వ అవతరణకు ప్రారంభమని కూడా చెప్పవచ్చు. రాజకీయ స్వాతంత్య్రానంతరం ముప్పైఏళ్ళు నిరంతరాయంగా సాగిన ఏకపక్ష 'నియంతృత్వమే దీనికి అనువైన వాతావరణాన్ని కల్పించింది. రాజకీయ నాయకత్వానికి, మతప్రవక్తకుగల మహిమాన్విత ఆకర్షణ (కెరిస్మా)ను కలిగించడమనేది వెనకబడిన సమాజాల జీవిత విశేషాలలో ఒకటి. అది మహాత్మాగాంధీకైతే తగునేమోగాని, ఆయన ఇంటిపేరు తన సొంత పేరుగా చేసుకున్న ఇందిరా నెహ్రూకు తలకెక్కిపోయింది. తండ్రి జవహర్లాల్, తాత మోతీలాల్, అమ్మ కమల, నానమ్మ స్వరూప్ రాణి, అందరూ ఒకరికి తగ్గి మరొకరు జాతీయోద్యమంలో త్యాగాలు చేసి కష్టాలుపడి సమకూర్చిపెట్టిన కీర్తినీ ప్రజాభిమానాన్నీ రాజకీయ రొక్కం చేసుకునేందుకు పూనుకున్నారు ఇందిరాగాంధీ, సుపుత్రుడు సంజయ్ గాంధీ.......................© 2017,www.logili.com All Rights Reserved.