“నాకో కథ చెప్పవే”
మాటలాడ నేర్చిన వెంటనే పసిపాప “నాకో కథ చెప్పవే" అని అడుగుతుంది. " అనగా అనగా ఒక రాజకుమారుడూ, అతని సావాసగాడైన మంత్రి కుమారుడూ -" అని అవ్వ కథ మొదలు పెడుతుంది.
ఇంతలో అవ్వకు అడ్డుగా వచ్చి, బడిపంతులుగారు "మూడు నాలుగులు పన్నెండు" అని కథను ఆపివేస్తాడు.
పిల్లలు బాగుపడవలెనని కోరుకొనేవాళ్ళు "మూడు నాలుగులు పన్నెండు; యిది నిజం; రాజకుమారుడి కథ అంతా కట్టుకథ; కాబట్టి -" అంటూ పసివారి చెవులు బద్దలయ్యేటట్లు అరవసాగుతారు.
కాని, ఈ ఘోష పసివాళ్ళ మనసులలో నాటుకోదు. రాక్షసులను రాజకుమారుడు హతమార్చిన యేవో దూరపుసీమలకు, రూపురేఖలు లేని లోకాలకు పసివాళ్ళ మనసులు యెగిరిపోతాయి. ఎంత గొప్ప గణితానికైనా సరే అక్కడికి యెగిరిపోవడానికి రెక్కలు లేవు.
పిల్లల బాగు కోరినవాళ్ళు తలలు వూపి, “చెడిపోయారు; పనికిమాలి పోయారు; దెబ్బకుగాని బుద్ధిరాదు" అని అంటారు.
బడిపంతులు అవ్వ నోరు మూసివేశాడు. కాని, కథలు చెప్పే వారికి లోటులేదు. ఒకరు పోతే యింకొకరు చెప్తారు. పిల్లల బాగుకోరిన వాళ్ళు “ఇవన్నీ అబద్ధాలు, కల్పనా కథలు" అని నోరు నొప్పిపుట్టేటట్లు కంఠశోషగా లబోదిబో కొట్టుకొంటారు. కాని, అంతా వృథా ప్రయాస.
ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు, ఉన్నత పాఠశాల నుండి కళాశాల వరకు పసిపిల్లలను మార్చవలెననే ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి. "నాకో కథ చెప్పవే!" అని వాళ్ళు అడగడం మట్టుకు ఎప్పుడూ మానరు.
ప్రపంచమంతటా, ప్రతి యింటిలోనూ ఏయేటి కాయేడు కథలు గుట్టమీద గుట్టపడేటట్లు పెరుగుతూనే వుంటాయి. మనిషి యింతటి బరువైన, విలువైన వారసత్వాన్ని మరే యితర రంగంలోనూ సంపాదించలేదు.
పిల్లల బాగు కోరినవాళ్ళు ఒక విషయాన్ని గురించి అసలు సరిగా.............................
“నాకో కథ చెప్పవే” మాటలాడ నేర్చిన వెంటనే పసిపాప “నాకో కథ చెప్పవే" అని అడుగుతుంది. " అనగా అనగా ఒక రాజకుమారుడూ, అతని సావాసగాడైన మంత్రి కుమారుడూ -" అని అవ్వ కథ మొదలు పెడుతుంది. ఇంతలో అవ్వకు అడ్డుగా వచ్చి, బడిపంతులుగారు "మూడు నాలుగులు పన్నెండు" అని కథను ఆపివేస్తాడు. పిల్లలు బాగుపడవలెనని కోరుకొనేవాళ్ళు "మూడు నాలుగులు పన్నెండు; యిది నిజం; రాజకుమారుడి కథ అంతా కట్టుకథ; కాబట్టి -" అంటూ పసివారి చెవులు బద్దలయ్యేటట్లు అరవసాగుతారు. కాని, ఈ ఘోష పసివాళ్ళ మనసులలో నాటుకోదు. రాక్షసులను రాజకుమారుడు హతమార్చిన యేవో దూరపుసీమలకు, రూపురేఖలు లేని లోకాలకు పసివాళ్ళ మనసులు యెగిరిపోతాయి. ఎంత గొప్ప గణితానికైనా సరే అక్కడికి యెగిరిపోవడానికి రెక్కలు లేవు. పిల్లల బాగు కోరినవాళ్ళు తలలు వూపి, “చెడిపోయారు; పనికిమాలి పోయారు; దెబ్బకుగాని బుద్ధిరాదు" అని అంటారు. బడిపంతులు అవ్వ నోరు మూసివేశాడు. కాని, కథలు చెప్పే వారికి లోటులేదు. ఒకరు పోతే యింకొకరు చెప్తారు. పిల్లల బాగుకోరిన వాళ్ళు “ఇవన్నీ అబద్ధాలు, కల్పనా కథలు" అని నోరు నొప్పిపుట్టేటట్లు కంఠశోషగా లబోదిబో కొట్టుకొంటారు. కాని, అంతా వృథా ప్రయాస. ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు, ఉన్నత పాఠశాల నుండి కళాశాల వరకు పసిపిల్లలను మార్చవలెననే ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి. "నాకో కథ చెప్పవే!" అని వాళ్ళు అడగడం మట్టుకు ఎప్పుడూ మానరు. ప్రపంచమంతటా, ప్రతి యింటిలోనూ ఏయేటి కాయేడు కథలు గుట్టమీద గుట్టపడేటట్లు పెరుగుతూనే వుంటాయి. మనిషి యింతటి బరువైన, విలువైన వారసత్వాన్ని మరే యితర రంగంలోనూ సంపాదించలేదు. పిల్లల బాగు కోరినవాళ్ళు ఒక విషయాన్ని గురించి అసలు సరిగా.............................© 2017,www.logili.com All Rights Reserved.