ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్ధ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగా ఉంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్ధిక స్వావలంబన సాధించడం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్య౦లో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'ధండగ' నే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్ళీ సేద్యానికి' తరలమని చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికథ.
- వకుళాభరణం రామకృష్ణ
మన దేశపు పల్లె జీవనానికి ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ, ఇంత గొప్ప పుస్తకం తెలుగులోకి రావడం అధ్బుతమైన విషయం.
- సి. రమాదేవి, రచయిత్రి
మూల భాష నుంచి నేరుగా లక్ష్య బాషలోకి అనువదించిన రచనలకు విశ్వసనీయత ఎక్కువ. అసలు రచనలోని సొగసు, కథనంలోని ప్రత్యేకతలను పెద్దగా మార్పులేమీ లేకుండానే పాఠకులు గ్రహించే అవకాశం ఉంటుంది. 'మరల సేద్యానికి' కూడా మూల భాష నుంచి నేరుగా అనువదించిన రచనే. సూక్ష్మ అంశాలను కూడా విస్మరించకుండా సవివరంగా రికార్డ్ చేసినట్టు రాసిన ఈ నవలలో ప్రకృతి వర్ణనలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. సముద్ర హోరు నవల పొడవునా కథనానికి నేపధ్య సంగీతంలా వినిపిస్తుంది! తిరుమల రామచంద్ర అనువాద నైపుణ్యం, నిఘంటువుల్లో కూడా దొరకని కన్నడ మాండలిక పదాలను అనువదించేందుకు ఆయన తీసుకున్న శ్రద్ధ, శ్రమ ఈ నవల ఉన్నతంగా రూపొందటానికి కారణం.
- సీ హెచ్. వేణు, జర్నలిస్ట్, ఈనాడు
వందేళ్ళ కాలంలో ఒక కుటుంబంలో జరిగిన మూడు తరాల జీవన యానాన్ని అధ్బుతంగా చిత్రితమైన కథ ఇది. ఈ నవల అవసరం ఇప్పుడు చాలా ఉంది. కళ్ళముందు కరిగిపోయిన సహజ జీవన శైలిని ఇప్పుడు తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించ లేకపోయినా, అది కరిగిపోయిన క్రమం ఎలా౦టిదో ఈ నవల్లో తెలుసుకోవచ్చు. ఒక ప్రశాంతమైన నవల. తప్పక చదవాల్సిన నవల.
- సుజాత ఆస్టిన్
© 2017,www.logili.com All Rights Reserved.